రాష్ట్రీయం

విందు.. పసందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన అతిథులకు, సాహిత్య అభిమానులకు నోరూరించే వంటకాలతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ విందు ఏర్పాటు చేసింది. ఆరగించిన వారంతా ఆహా..! తెలుగు విందు బహు పసందు అంటూ సంబరపడ్డారు. ఐదు రోజులపాటు జరిగే సభలకు భోజన ఏర్పాట్ల బాధ్యతలను పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శనివారం రెండో రోజు ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి, తెలుగు వర్శిటీ, లలిత కళాతోరణంలో భోజన ఏర్పాట్లను మంత్రి ఈటల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. అతిథులతో కలిసి భోజనం చేశారు. తిన్నవారంతా.. రేపు వంటకాలేంటి? అని ప్రశ్నించిన వాళ్లే. వెజ్ బిర్యాని, పట్టువడియాల పులుసు, వంకాయ బగారా, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, చింతకాయ పండుమిర్చిల చట్నీ, దొండకాయ పచ్చడి, పచ్చిపులుసు, టమోట రసం, చింతపండు పులిహోర, గాజర్ కా హల్వా, డ్రైప్రూట్ సలాడ్, పిండివంటలు, స్పెషల్ పనీర్ బటర్ మసాలాలు విందులో ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల ప్రకటనలో తెలిపింది.

చిత్రం....వంటకాలు ఆరగిస్తున్న అతిథులు