రాష్ట్రీయం

పాటకే.. పదునెక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ‘పైసల సమాజంగా కాకుండా మానవతా విలువలు ఉన్న సమాజంగా తీర్చిదిద్దండి..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రచయితలు, కవులకు పిలుపునిచ్చారు. మాట కంటే పాట పదునైందన్న విషయాన్ని తెలంగాణ ఉద్యమం నిరూపించిందన్నారు. ప్రపంచ తెలుగు మహా సభల రెండో రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనం కార్యక్రమాలకు మంత్రి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాట యావత్ ప్రజానీకాన్ని కదిలించింది.. చైతన్యవంతం చేసింది.. కన్నీళ్లు పెట్టించింది.. కనె్నర్ర చేసేలా చేసింది.. బరిగీసి కొట్లాడే ధైర్యం ఇచ్చిందని అన్నారు. పాట పాత్ర మాటల్లో చెప్పలేనిదన్నారు. కవులు తాము రాసిన కవితలు జనంలో చైతన్యం నింపినపుడే సంతోషపడతారన్నారు. కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథమే కాదు సామాజిక బాధ్యతా ఉన్నట్లు భావిస్తారంటూనే, ఒక సిరా చుక్కనుంచి పుట్టిన పాట అనేక ఉద్యమాలకు పునాదులు వేస్తుందని భాగవర్భితంగా చెప్పారు. పాశ్చాత్య నాగరికతలో పడి మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలుగు భాషాభిమాని మాత్రమే కాదని, స్వయంగా కవి, రచయిత అని చెప్పారు. తెలంగాణ చాలా పాటల్లో సీఎం కేసీఆర్ ఆలోచన ఉందని, మన కవులు రాసిన పాటలు మానవ జీవితం ఉన్నంత కాలం ఉంటాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్త ఒరవడిని సృష్టిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు అన్నారంటే రీ-ఓరియెంటెడ్, రీ-ఇనె్వంటెడ్ తెలంగాణ చెప్పారని, దాని కోసమే ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. వానమ్మా, వానమ్మా అనే పాట హృదయాలను హత్తుకుంటుంది, కదిలేది, కదిలించేది, పెను తుపాను సృష్టించేది పాట అని శ్రీశ్రీ అన్నారని ఆయన గుర్తు చేశారు. శ్రీశ్రీ రాసిన పాటలు గుర్తు చేసుకుంటే రక్తం ఉప్పొంగుతుందని, ఆ నల్లటి ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో అని దాశరధి రాసిన పాట చరిత్ర ఉన్నంత కాలం ఉంటుందని అన్నారు. తెలుగు మహా సభలు ఒక చారిత్రక అవసరం ఇంత మంది జనం ఎవరు పిలిస్తే రాలేదని, మరోసారి తమ అంతరంగాన్ని ఆవిష్కరించే వేదిక ఇది అని భావించి వచ్చారని ఆయన తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక బాధ ఒక అలజడి ఉందని, సమాజం కలిపించిన ఈ అలజడిని వ్యక్తులుగా ఎదుర్కొలేం కాబట్టి సమాజంగానే ఎదుర్కొందాం అని భావించి వారు వస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో తాత, తండ్రి అందరం కలిసి బతికినామని, ఇప్పుడు అమ్మ, నాన్నలను వృద్ధాశ్రమంలో వేస్తున్నామని, అందుకే ఇది బాగుపడ్డ సమాజం కాదు బతికి చెడ్డ సమాజం అని తనలాంటి వాళ్ళు భావిస్తారని ఆయన తెలిపారు. దానిని కాపాడుకునే క్రమటలో ఈ ప్రపంచ మహాసభలు నిర్వహించుకుంటున్నాం కాబట్టి వీటిని డబ్బులతో కొలవలేం, బేరీజు వేయడం లేం, పాత పద్ధతులను నవ సమాజానికి అందించడమే ప్రపంచ మహా సభల సంకల్పం అని మంత్రి ఈటల అన్నారు. రచయితలు, కవులు సమాజాన్ని పైసల సమాజంగా కాకుండా మానవతా విలువలు ఉన్న సమాజంగా తీర్చిదిద్దాలని, ఆ చైతన్యాన్ని, కేకని ప్రపంచానికి వినిపించేందుకు తెలంగాణ మహా సభలు వేదిక కావాలని ఆకాంక్షించారు. అభివృద్ధి- సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళతామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు.

చిత్రం..ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్