రాష్ట్రీయం

రాష్ట్రంలో కొత్తగా 9 కొత్త మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలో వివిధ అర్బన్ మండలాలను విభజించి, 9 కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ అర్బన్ మండలాన్ని విజయవాడ (తూర్పు), విజయవాడ (సెంట్రల్), విజయవాడ (నార్త్), విజయవాడ (వెస్ట్) మండలాలుగా విభజించింది. విశాఖ అర్బన్, రూరల్ మండలాలను సీతమ్మధార, మహారాణిపేట, గోపాలపట్నం, ములగాడ, విశాఖ (రూరల్) మండలాలుగా, కర్నూల్ మండలాన్ని అర్బన్, రూరల్ మండలాలుగా, నెల్లూరు మండలాన్ని కూడా అర్బన్, రూరల్ మండలంగా, గుంటూరు మండలాన్ని గుంటూరు (ఈస్టు), గుంటూరు (వెస్టు)గా విభజించింది