రాష్ట్రీయం

ఐఏఎస్‌లకు కుదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మంగళవారం భారీ కుదుపునకు గురైంది. ఒకేసారి 31 మంది ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. చేసింది. ఇద్దరు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లు మొత్తంగా 31 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఏడాదిన్నరలో రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రాధాన్యతలను సమర్థవంతంగా అమలు చేయగలిగిన అధికారుల జట్టును ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సురేశ్ చందాను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా, మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనాను ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారిని రెవెన్యూ కార్యదర్శిగా నియమించింది. సిఎంఓ అదనపు కార్యదర్శిగా ఉన్న శాంతికుమారిని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమించింది. మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్‌ను కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్‌గా నియమించి ఈయన స్థానంలో అరవింద్‌కుమార్‌ను నియమించింది. బిసి సంక్షేమ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఎక్సైజు శాఖ కమిషనర్‌గా ఉన్న ఆర్‌వి చంద్రవదన్‌ను విపత్తు నిర్వహణ కమిషనర్‌గా నియమించి రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సోమేశ్‌కుమార్‌ను ఎక్సైజుశాఖ కమిషనర్‌గా నియమించింది. పశు సంవర్ధకశాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియాను నియమించింది. బిసి సంక్షేమశాఖ కమిషనర్‌గా అనితా రాజేంద్రను, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా దానకిశోర్‌ను, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా క్రిస్టినాను, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాశ్‌ను నియమించింది. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా ఉన్న వాకాటి కరుణను భూ పరిపాలన డైరెక్టర్‌గా నియమించింది. రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా ఇలంబర్తి, సైనిక సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శిగా చంపాలాల్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా ప్రీతిమీనాను నియమించింది. వికారాబాద్ కలెక్టర్‌గా ఒమర్ జలీల్, నిజామాబాద్ కలెక్టర్‌గా ఎంఆర్‌ఎం రావు, జనగామ కలెక్టర్‌గా ఉన్న దేవసేనను పెద్దపల్లి కలెక్టర్‌గా బదిలీ చేసి యాదాద్రి కలెక్టర్‌గా ఉన్న అనితా రామచంద్రన్‌ను జనగామ కలెక్టర్‌గా బదిలీ చేసింది. మెదక్ కలెక్టర్ మాణిక్‌రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రణాళికా బోర్డు కార్యదర్శిగా శివకుమార్ నాయుడు, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అశోక్‌కుమార్‌ను, ఓఎస్‌డిగా కాళీచరణ్‌ను నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్లుగా భారతి హోళికేరి, సిక్బా పట్నాయక్, ముషారఫ్ అలీని నియమించింది. బోధన్ సంయుక్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతిని, మెట్‌పల్లి సంయుక్త కలెక్టర్‌గా గౌతమ్, భద్రాచలం సంయుక్త కలెక్టర్‌గా పమేలా సత్పతి, బెల్లంపల్లి సంయుక్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్‌ను నియమించింది.