రాష్ట్రీయం

కోడి పందేలకు అనుమతించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కూడా కోడిపందేలు నిర్వహించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిని ఆదేశించింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా ఎక్కడ కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎక్కడైనా ఈ పందేలు జరిగితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కలిదిండి రామచంద్రరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది. 2016 డిసెంబర్‌లో తాము జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిర్లక్ష్యంగా ఉండరాదని, కోట్లాది రూపాయలు ఈజూదం పేరిట చేతులు మారుతున్నాయని కోర్టు పేర్కొంది. కోడిపందేలను పండగ సమయాల్లో నిర్వహించడానికి సుప్రీం కోర్టు అనుమతించలేదన్నారు. చట్టాన్ని అమలు చేయడం ద్వారానే కోడిపందేలు జరగకుండా నిరోధించాలని కోర్టు పేర్కొంది. పశ్చిమగోదావరి ఎస్పీ ఒక వేళ ఈ పందేలను జరగకుండా నిరోధించలేమని చెబితే సమర్థుడైన మరో అధికారిని నియమించాలని ఆదేశిస్తామని కోర్టు పేర్కొంది. ఈ గ్యాంబ్లింగ్ నిరోధించేందుకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీని హైకోర్టు ఆదేశించింది.