రాష్ట్రీయం

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వ సంస్థా? కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: భారత సైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలోని సంస్థగా ఉంటుందో లేదా అనే విషయమై వివరాలు ఇవ్వాలంటూ హైకోర్టు మంగళవారం పిటిషనర్లను ఆదేశించింది. ఉస్మానియా వర్శిటీకి చెందిన ఎస్ కిరణ్‌కుమార్, మరో రీసెర్చి విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఉస్మానియా వర్శిటీలోనే షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలంటూ పిల్‌ను పిటిషనర్లు దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించి పై మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ సైన్స్‌కాంగ్రెస్ ప్రభుత్వ సంస్థకాదని అందుకే ఈ విషయంలో మాండమస్ ఇవ్వలేమని కోర్టు పేర్కొంది.