రాష్ట్రీయం

మేడారం జాతరకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడ్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో బుధవారం ఉప రాష్టప్రతి వెంకయ్యను ఇంద్రకరణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జాతర ఏర్పాట్లుపై ఉపరాష్టప్రతికి మంత్రి వివరించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని వెంకయ్యకు ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మేడారం జాతరకు వస్తానని ఉపరాష్టప్రతి హామీ ఇచ్చారని అనంతరం ఇందకరణ్‌రెడ్డి విలేఖరులతో తెలిపారు. ఉపరాష్టప్రతిని కలిసినవారిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు నగేష్, సీతారాం నాయక్ ఉన్నారు.
రాష్ట్భ్రావృద్ధికి సహకరించండి
ఆదిలాబాద్‌లో జంతు, పశు జీవ వైవిధ్య ప్రదర్శనశాల ఏర్పాటుకు రూ.125 కోట్లు విడుదల చేయాలని కేంద్ర పర్యావరణ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్ శర్మను తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న విజ్ఞప్తి చేశారు. బుధవారం రామన్న కేంద్ర మంత్రులు థావర్‌చంద్ గెహ్లాట్, అనంత్ గీతే, మహేష్ శర్మ, ఆల్పోన్స్ కన్నన్‌తనంలతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి, సంక్షేమ అంశాలతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో రామన్న చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ- జంతు, పశు జీవ వైవిధ్య ప్రదర్శనశాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రూ.185కోట్లతో ప్రతిపాదన అందించిందని, ఇందులో కేంద్రం వాటా రూ.125కోట్లు త్వరగా విడుదల చేయాలని మహేష్ శర్మను కోరినట్టు తెలిపారు. అలాగే కరీంనగర్‌లో క్యాటగిరి ఒకటి విభాగంలో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతరం సామాజిక, న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌తో బీసీ వర్గాల సమస్యలు, స్కాలర్‌షిప్‌లపై చర్చించినట్టు రామన్న వివరించారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్‌గీతేను కలిసి రాష్ట్రంలోని భారీ పరిశ్రమల అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఆల్పోన్స్‌తో చర్చించినట్టు ఆయన వెల్లడించారు.