రాష్ట్రీయం

ఉసురుతీసిన రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని/ అశ్వాపురం, జనవరి 3: రాష్ట్రంలో రెండు రోడ్డు ప్రమాదాలు పదిమంది ప్రాణాలు బలితీసుకున్నాయ. కర్నూలు జిల్లా చిన్నహోత్తూరు వద్ద టిప్పర్ బోల్తా పడటంతో ఏడుగురు వలస కూలీలు మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద కేబుల్ పనులకు వచ్చిన వారిని భారీ వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వలసకూలీలు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఆస్పరి మండలం చిన్నహోత్తూరు గ్రామం సమీపంలో టిప్పర్ బోల్తా పడడంతో అందులో ఉన్న వలసకూలీలు శేషమ్మ, హనుమంతమ్మ, గోవిందమ్మ, నర్సమ్మ, ఈరమ్మ, చిన్న మంగమ్మ, నారాయణ మృతి చెందారు. వీరంతా హొళగుంద మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వారు. తెలంగాణ రాష్ట్రం నల్లగొండలో పత్తి కోతలకు వెళ్లిన కూలీలు స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేటకు చెందిన వలస కూలీలు 20 మంది నల్లగొండ నుంచి టిప్పర్‌లో మంగళవారం రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న టిప్పర్ ఆస్పరి మండలం చిన్నహోత్తూరు గ్రామం వద్దకు చేరుకోగానే ముందు టైర్ పేలిపోయింది. దీంతో డిస్క్ ఊడిపోయి టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. టిప్పర్ వెనుక భాగంలో కూర్చున్న శేషమ్మ(45), హనుమంతమ్మ(18), గోవిందమ్మ(55), నర్సమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నారాయణ(40), ఈరమ్మ(50), చిన్న మంగమ్మ(45)ను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. వీరికి ఆదోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో కొత్తపేటలో విషాదం అలముకుంది.
ఊపిరాడక మృతి...
టిప్పర్‌లోని బియ్యం బస్తాల కింద పడి ఊపిరాడక కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. పనికి వెళ్లిన వీరు బియ్యం బస్తాలు కొనుగోలు చేసి టిప్పర్‌లో వెంట తెచ్చుకుంటున్నారు. టిప్పర్ బోల్తా పడగానే కూలీలపై బియ్యం బస్తాలు పడ్డాయి. దీంతో ఊపిరాడక శేషమ్మ, హనుమంతమ్మ, గోవిందమ్మ, నర్సమ్మ అక్కడిక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదం జరగ్గానే అప్రమత్తమైన చుట్టుపక్కల వారు వచ్చి బియ్యం బస్తాలు తొలగించేలోగా నలుగురు విగతజీవులుగా మిగిలారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఊరుగాని ఊరులో చెమడోచ్చి సంపాదించిన డబ్బుతో బియ్యం కొనుక్కుని ఇంటిల్లిపాదీ కడుపారా తిందామని ఆశపడ్డ వారి బతుకులు అవే బియ్యం బస్తాల కింద పడి చితికిపోవడం పలువురిని కలచివేసింది.

అశ్వాపురంలో ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మొండికుంట వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ కేబుల్ వైరు పనుల నిమిత్తం కొంతమంది కూలీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. ఉదయం డీసీఎం వ్యాన్‌లో నుంచి కేబుల్ వైర్ బండిల్స్ మొండికుంట వద్ద జరుగుతున్న పనుల ప్రదేశంలో దింపుతుండగా మణుగూరు నుంచి పాల్వంచ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాన్‌లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివరాత్రి గోపయ్య(50), సన్యాసిపేట కనకారావు(43), డీసీఎం వ్యాన్ డ్రైవర్ తోలేటి భాగ్యారావు (25) మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. సంఘటన స్థలిని సిఐ అల్లం నరేందర్, ఎస్సై రాంజీ పరిశీలించారు.