రాష్ట్రీయం

అడ్డంగా దొరికాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 12: ఓ మల్టీనేషనల్ నేషనల్ ప్రైవేటు కంపెనీకి చెందిన ప్రతినిధుల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఉప్పు ఏడుకొండలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫైల్ క్లియరెన్స్ కోసం సదరు అధికారి పెద్ద మొత్తంలో లంచం డిమాండు చేయడంతో ఏసీబీ అధికారులు నిఘా వేసి పట్టుకున్నారు. నిందితుని నుంచి రూ.23 లక్షల 20 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసిబి డీజీ ఆర్‌పి ఠాకూర్ తెలిపారు. ముంబయి ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఐటీడీ సెమెంటేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ దేశంలోని పలు చోట్ల వివిధ పనులు చేపడుతోంది. కాగా.. గతంలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు, గంగవరం పోర్టు పనులతోపాటు, విశాఖ స్టీల్ ప్లాంటుకు సంబంధించి పనులు చేపట్టింది. దీనికి సంబంధించి 2010 అక్టోబర్ 1 నుంచి 2014 మే 31వ తేదీ వరకు నాలుగేళ్ళ కాలంలో వాణిజ్య పన్నుల శాఖ నుంచి కంపెనీకి 4.67 కోట్ల రూపాయలు రిఫండ్ ట్యాక్స్ క్లియరెన్స్ చేయాలని కంపెనీకి చెందిన లీగల్ కన్సల్టెంట్ ఐ గోపాలశర్మ, అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ కారంశెట్టి సత్యనారాయణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఏడుకొండలను సంప్రదించారు. దీంతో ఫైల్ క్లియర్ చేయాలంటే 25లక్షలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండు చేయడంతో శుక్రవారం కృష్ణాజిల్లా కంకిపాడు మండలం, ఈడ్పుగల్లులోని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో 23 లక్షల 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడు ఏడుకొండలతోపాటు.. కంపెనీకి చెందిన వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్లు ఏసిబి డీజీ ఠాకూర్ తెలిపారు. డీజీతోపాటు డైరెక్టర్ ఎన్ బాబ్జి, హరికుమార్, అబ్రహాం లింకన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..ఏడుకొండలు