రాష్ట్రీయం

జాప్యం చేస్తే జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులకు జరిమాన విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక విధానంలో అనుమతుల జారీలో జాప్యం జరిగితే జరిమాన విధించే విధానాన్ని మున్సిపల్‌శాఖలో కూడా అమలు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట తారకరామారావు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ, జల మండలి, జిహెచ్‌ఎంసి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖాధిపతులతో మంత్రి కెటిఆర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. మున్సిపాల్టీల్లో భవన నిర్మాణ అనుమతులకు నిర్ణీత కాలపరిమితి పెట్టాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పారిశ్రామిక విధానంలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకుంటే సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇచ్చే విధానం అమలు జరుగుతుందని, అలాంటి విధానానే్న భవన నిర్మాణాలకు అమలు చేయాలన్నారు. భవన నిర్మాణాల అనుమతుల జారీలో జాప్యానికి కారణమయ్యే అధికారులకు జరిమానాలు విధించే విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రైవేట్ పార్కింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో పాటు మల్టీ లెవల్ పార్కింగ్‌లకు టెండర్లు ఆహ్వానించాలన్నారు. నగరవ్యాప్తంగా వంద ఫుట్ ఒవర్ బ్రిడ్జిలను నిర్మించాలని ఆదేశించారు.
నగరంలో ఏడాది పాటు రోడ్డ్ కట్టింగ్‌లకు అనుమతులు ఇవ్వవద్దని మంత్రి ఆదేశించారు. జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ముందుగానే తనకు నివేదిక ఇవ్వాలన్నారు. మున్సిపాల్టీల్లో మంచినీటి సరఫరా పాత పైపులను మార్చి కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ఉప్పల్‌లో శిల్పరామం నిర్మించే పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. జలం-జీవం అంశంపై వచ్చే నెల మొదటివారంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

చిత్రం..శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్