తెలంగాణ

అవినీతికి పాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాసకు కట్టబెట్టింది విజయం కాదు, నమ్మకం. ప్రజల బాధలు, కష్టాలు తొలిగిపోతాయన్న నమ్మకంతో మహత్తర విజయం అందించారు. ఆ నమ్మకాన్ని వమ్ముకానివ్వకండి’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు కార్పొరేటర్లకు హితవు పలికారు. కొత్తగా ఎన్నికైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు క్యాంపు కార్యాలయంలో శనివారం సిఎం కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కెసిఆర్ వాళ్లను ఉద్దేశించి మాట్లాడారు. పేరుపేరునా కార్పొరేటర్లను అభినందించారు. ప్రజాకాంక్షకు తగినట్టుగా పనిచేసి, మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలు అతి గొప్ప విజయం కట్టబెట్టారు. జీవితంలో చాలామందికి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం వస్తుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో పార్టీకి అవకాశం దక్కుతుంది. ఇప్పుడు గెలిచిన వారిలో కొత్తవారున్నారు, పాత వారూ ఉన్నారు. నగరంలో కోటిమంది జనాభావుంటే కేవలం 150మందికే కార్పొరేటర్లుగా పని చేసే అవకాశం దక్కింది. ఇది దృష్టిలో పెట్టుకుని వచ్చిన అవకాశాన్ని ఎంత గొప్పగా సద్వినియోగం చేసుకుంటారనేదే ముఖ్యం అని కెసిఆర్ జాగ్రత్తలు చెప్పారు. ప్రజలు తమ బాధల్ని, కష్టాల్ని మీపై పెట్టారు. వాటినుంచి విముక్తి కోరుతున్నారు. ఈ బాధ్యత నిర్వర్తించాల్సింది మీరేనంటూ మార్గదర్శనం చేశారు. బస్తీల్లో చాలా బాధలున్నాయి. వాటన్నింటినీ తొలగించే బాధ్యత ఇప్పుడు మీమీద ఉందన్నారు. బతికున్నంత కాలం నిజాయితీగా ఉందామని, అవినీతిని సహించేది లేదని, కార్పొరేటర్లు పారదర్శకంగా ఉండాలని సూచించారు. జిహెచ్‌ఎంసి నుంచి ఖర్చుపెట్టే ప్రతి పైసా పేదల సంక్షేమానికి ఉపయోగపడాలన్నారు. మంచినీరు, విద్యుత్, రహదారులు, మురికి కాల్వలు తదితర వౌలిక సదుపాయాల విషయంలో మంచి ప్రణాళికలు రూపొందించాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం, ఆసరా పథకం గ్రేటర్ ఎన్నికల్లో మంచి ప్రభావం చూపించాయన్నారు. ఏడాదిలో నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించనున్నట్టు కెసిఆర్ భరోసా ఇచ్చారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం నగరంలో బాగా జరిగేలా కార్పొరేటర్లు చూడాలని కోరారు.
ఎన్నికల సందర్భంగా కొంతమంది ఆంధ్ర, తెలంగాణ అని విభజన తెచ్చే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆంధ్ర సిఎం చంద్రబాబు దాదాపు 15చోట్ల సభలు పెట్టారని, తాను మాత్రం కేవల ఒకే సభలో మాట్లాడానన్నారు. తెదేపాకు ఒక్క సీటిస్తే మనకు 99 సీట్లు ఇచ్చారని వివరించారు. అంటే ప్రజలు మనపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ ప్రజలంతా మనల్ని నమ్మారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. వారి నమ్మకం, ఆకాంక్షలకు తగినట్టుగా పని చేస్తూ, నగరాభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రణాళికలు తయారుచేద్దామని సూచించారు. త్వరలోనే కార్పొరేటర్లకు రెండు రోజుల శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్టు చెప్పారు. నగరానికి ఏం చేద్దాం? నిధులెలా ఖర్చు పెడదాం? ప్రణాళికాబద్ధంగా ఎలా ముందుకెళదాం అనేది చర్చిద్దామని కెసిఆర్ సూచించారు. వెయ్యేళ్లు బతికేందుకు ఎవరూ భూమీదకు రాలేదు. బతికినంతకాలం ఎంత బాగా పని చేశామన్నదే ముఖ్యం. కార్పొరేటర్లంతా మంచిగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం నాకుంది అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, విజయం సాధించిన కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
chitram...
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో
వేంకటేశ్వర వైభవోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి కెసిఆర్