తెలంగాణ

అసెంబ్లీని స్తంభింపజేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రయోజనాలను దెబ్బతిసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మరో కుట్రకు తెరలేపారని, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి డింఢి ప్రాజెక్టుకు 60 టిఎం సిల నీటి తరలింపుని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, రాంమోహన్‌రెడ్డిలు తెల్చి చెప్పారు. శనివారం మహబూబ్‌నగర్‌లోబచావో తెలంగాణ వ్యవస్థాపకులు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బచావో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టిడిపికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బిజెపి నాయకులు, సిపిఐ, సిపిఎం నాయకులు, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నేతలు, రిటైర్డు ఇంజనీర్ల్లు పెద్దఎత్తున హాజరయ్యారు. మహబూబ్‌నగర్ ఎత్తిపోతల పథకం నుండి నల్గొండ జిల్లాలోని డింఢి ప్రాజెక్టుకు నీటిని తరలింపును వ్యతిరేకిస్తూ రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు కొనసాగిన సమావేశంలో నాయకులంతా ముక్తకంఠంతో డింఢి ప్రాజెక్టుకు నీటి తరలింపును వ్యతిరేకిస్తూ తీర్మాణం చేశారు.