ఆంధ్రప్రదేశ్‌

ముగింపు అదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ ఆర్‌కే బీచ్ యుద్ధ విమానాల ఘోషతో అదిరిపోయింది. బాంబుల మోతతో దద్దరిల్లింది. తుపాకీ శబ్దాలతో మార్మోగింది. దూసుకుపోతున్న మిసైళ్లు.. తీరానికి దగ్గరగా వచ్చి నైపుణ్యాన్ని ప్రదర్శించిన హెలికాప్టర్లు.. ఒకటేమిటి. నిజంగా యుద్ధ భూమిలో ఉన్నామా? అన్నట్టున్నాయి ఫ్లీట్ రివ్యూ ముగింపు సన్నివేశాలు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలోని ప్రధాన ఘట్టాల్లో ఆఖరిదైన ఆపరేషనల్ డెమో ఆదివారం సాయంత్రం ఆర్‌కే బీచ్‌లో అట్టహాసంగా సాగింది. ప్రధాని మోదీ డెమోను వీక్షించారు. ఒడిశానుంచి ప్రత్యేక విమానంలో నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకుని, డేగా ఎయిర్ స్టేషన్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కోస్టల్ బ్యాటరీకి చేరుకున్నారు. సరిగ్గా 5.30కు ఆర్‌కే బీచ్‌కు చేరుకోగా, ఆయన చేరుకున్న వెంటనే మూడు చేతక్ హెలికాప్టర్లు నేవీ పతాకం, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ లోగోతో కూడిన పతాకం, జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ప్రధాని కూర్చున్న వేదిక ముందునుంచి వెళ్లాయి. తీరానికి కొద్దిపాటి దూరంలో ప్రయాణిస్తున్న నాలుగు యుద్ధ నౌకలపై యుహెచ్3హెచ్, సీకింగ్-42, కమోవ్-31, చేతక్ హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే సన్నివేశం అందరినీ ఆశ్ఛర్యచకితులను చేసింది. వెనువెంటనే సీకింగ్-42 హెలికాప్టర్ ప్రధాని వేదిక ముందుకు వచ్చి ఆగింది. శత్రు స్థావరాలపై దాడి చేసేందుకు మెరైన్ కమాండోలను అందులోనుంచి కిందకుదించి వెళ్లిపోయింది. వెంటనే వారు భూభాగం మీద శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి శత్రువులను మట్టుపెట్టిన సన్నివేశం అద్భుతంగా సాగింది. జలాశ్వ యుద్ధ నౌక నుంచి దిగిన ఎల్‌సిఎంల నుంచి నావికాదళ సైనికులు కిందకు దిగి జెమినీ బోట్లపై వేగంగా ప్రయాణిస్తూ, శత్రు స్థావరాల్లో ఉన్న ఆయిల్ రిగ్‌ను పేల్చివేసే ఘట్టాన్ని ప్రధాని ఆసక్తిగా తిలకించారు. మరోపక్క భారత నౌకాదళంలోని అతి పెద్ద యుద్ధ నౌక అయిన ఐఎన్‌ఎస్ విరాట్ వచ్చి నిలిచింది. దానిపై నుంచి సీహారియర్ యుద్ధ విమానం దూసుకుపోవడాన్ని ప్రధానితోపాటు, ప్రేక్షకులంతా కళ్లార్పకుండా చూశారు. ఇంతలో అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనర్ (ఎజెటి) విమానాలు మూడు ప్రధానికి కనుచూపు మేర దూరంలో ఆకాశం నుంచి సమాంతరంగా దూసుకువచ్చి, త్రిశూలం మాదిరిగా విడిపోయి, ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. ఇంతలో సీహారియర్ యుద్ధ విమానం ప్రధాని వేదిక వద్దకు వచ్చి గాల్లో కొద్ది క్షణాలు నిలిచింది. అందులో పైలెట్ ప్రధానికి సాల్యూట్ చేయగా, ప్రధాని ప్రతి వందనం చేశారు. భారత నౌకాదళం సగర్వంగా చెప్పుకునే ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య ప్రధాని వేదిక ముందుకు వచ్చింది. దానిపై నుంచి మిగ్-29కె విమానం నిప్పులు కక్కుతూ ఆకాశంలోకి దూసుకుపోయిన సన్నివేశాన్ని చూసి, లక్షలాది మంది కేరింతలు కొట్టారు. బ్లాక్ పాంథర్ విమానాలు వెలుగు దివ్వెలను కిందకు వదులుతూ ముందుకు సాగాయి. భారత నౌకాదళంలోని అత్యాధునిక సాంకేతిక యుద్ధ విమానం పి8-ఐ నాలుగు మిగ్-29 విమానాలతో కలిసి ప్రధాని వేదిక మీద నుంచి దూసుకుపోయాయి. దాని వెంట భారత నౌకాదళం సమాచార, నిఘా కోసం వినియోగిస్తున్న సీ డ్రాగన్ సాగింది. హాక్స్ యుద్ధ విమానాలు శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి కనురెప్పపాటు కాలంలో మాయమైపోయాయి. ఆ తరువాత ఐఎన్‌ఎస్ సాత్పుర, మైసూర్, రణవీర్ యుద్ధ నౌకలు చేసిన మిసైల్ ఫైరింగ్ అద్భుతం. కోస్ట్‌గార్డ్ హోవర్ క్రాఫ్ట్ నౌక ప్రధాని వేదిక ముందు నుంచి సాగింది. ఇండియన్ నేవీ స్కైడైవర్స్ ప్యారాచ్యూట్‌ల మీద నుంచి కిందకు తిగి, తమతోపాటు తీసుకువచ్చిన మారిటైం హెరిటేజ్ బుక్ ప్రతులను లెఫ్ట్‌నెంట్ కమాండర్ సైనీ.. ప్రధాని మోదీకి అందచేశారు. ఆ పుస్తకాన్ని ఆయన విష్కరించారు. ఆ తరువాత రక్షణ మంత్రి పారికర్ ప్రధాని మోదీకి జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, గవర్నర్ నరసింహన్, భారత నౌకాదళాధిపతి ఆర్‌కె థావన్, తూర్పు నౌకాదళ అధికారి సతీష్ సోనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోకగజపతిరాజు, సుజనా చౌదరి, రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.