రాష్ట్రీయం

రెండు రాష్ట్రాల్లో పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/ హైదరాబాద్, జనవరి 22: ఇకనుంచి సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టనని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయస్తానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం జనసేన సమన్వయకర్తల సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన సాయంత్రం హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆంజనేయస్వామి ఆశీస్సులతోనే 2009లో బతికి బట్ట కట్టానని, అంజన్న అనుగ్రహంతోనే పార్టీని స్థాపించానని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. తమకు బలమున్న చోట తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. తెలంగాణవాసులకు ఇష్టదైవమైన కొండగట్టు నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించినట్టు స్పష్టం చేశారు. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరమే తమ పార్టీ విధానాలు ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణలో ప్రజల సమస్యలపై తమ కార్యకర్తల ద్వారా నివేదికలు సేకరించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవిస్తామని, ఈనెల 27న ఆంధ్రప్రదేశ్‌లోని
అనంతపూర్ జిల్లాలో కరవు యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అలాగే, విశాఖ ఏజన్సీ, తూర్పు గోదావరి జిల్లా ఉద్దానంలో కూడా పర్యటించి, అక్కడి ప్రజల సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. తమ పార్టీ వివాదాస్పద రాజకీయాలకు చోటునివ్వదని, పరిష్కార రాజకీయాలకు మాత్రమే పెద్దపీట వేయనుందని అన్నారు. ప్రచారం కోసం చౌకబారు విమర్శలు చేయటం తమ పార్టీ విధానం కాదని, ప్రజల తీర్పుతో వచ్చిన ప్రభుత్వాలను గౌరవించాల్సిన అవసరముందని అన్నారు. ఇతర పార్టీల మాదిరి తప్పుడు ఆరోపణలు చేస్తూ, రాజకీయ అస్థిరతకు గురిచేసే ఆలోచన తమ పార్టీకి ఎంతమాత్రం లేదన్నారు. అందుకే ఓటు నోటు కేసు విషయంలో వౌనంగా ఉన్నట్టు చెప్పారు. నిర్మాణాత్మక రాజకీయాలతో పార్టీని విస్తరించనున్నట్టు, ఇందుకోసం మేధావులు, రాజకీయ విశే్లషకులు, జర్నలిస్టులు, విద్యావంతులు కూడా సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు, వాటిని పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. తాను ఎవరి ప్రమేయంతో కానీ, ఎవరి ప్రోద్బలంతో కానీ రాష్ట్రంలో పర్యటించటం లేదని, తెలంగాణపై తనకున్న అభిమానం, ప్రేమతోపాటు అభిమానుల ఆశీస్సులతోనే ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. గతంలో ఎన్నికల ముందు ఆవిర్భవించి, అనంతరం కనుమరుగైన పార్టీల మాదిరి కాకుండా, సుదీర్ఘ రాజకీయాలు చేసేందుకే పార్టీ స్థాపించామని తెలిపారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా గతంలోనే ఆ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించినా తాను సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పారు.
ఎన్నో ఉద్యమాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి అవకాశమివ్వాల్సిన అవసరముందని, ఉద్యమ ట్యాగ్‌లైన్ నీళ్ళు, నిధులు, నియామకాలపై కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన స్మార్ట్‌గా ఉందని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రాల్లో సమస్యలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించాలని, ప్రధానంగా ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై సత్వరం స్పందించాలన్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశాలానంతరం సమన్వయకర్తలను ప్రకటిస్తామని, అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలకు షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అనంతరం కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని చర్చించారు. అంతకుముందు జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్‌కు ఘన స్వాగతం పలికారు.
ఇదిలావుంటే, సోమవారం ఉదయం ఆయన నివాసగృహం నుండి బయలుదేరినపుడు భార్య అన్నా లెచినోవా తిలకం దిద్ది హారతితో స్వాగతం పలికారు. పవన్ అక్కడి నుండి ప్రశాసన్ నగర్‌లోని పార్టీ పరిపాలనా కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నడూ లేనిరీతిలో వేలాది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆఫీసుకు తరలివచ్చారు. విభిన్న మతాలకు చెందిన మహిళలు వారి సంప్రదాయాలు ప్రకారం దైవ ప్రార్ధనలు జరిపి పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన సోషల్ మీడియాకు సంబంధించి వీర మహిళ పేరుతో ఏర్పాటైన విభాగాలను ప్రారంభించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ‘ఎస్పీ వీరమహిళ’ పేరుతో ఖాతాలను ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ వీర మహిళ బృందానికి తాను శుభాభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. సోషల్ మీడియాలో క్రియాశీల సభ్యులుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన వారిని స్వాగతించారు. జనసేన సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకువెళ్తూ ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువచ్చేలా అంతా కృషి చేస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజాశ్రేయస్సుకు మనం అవిరళ కృషి జరుపుదామని, దేశాభివృద్ధిలో మన వంతు పాత్రను పోషిద్దామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈనెల 27న అనంతపురంలో పర్యటించి, అనంతరం ఒంగోలు, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారు. ఒంగోలులో ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులను కలుస్తారు. అనంతరం విశాఖ ఏజన్సీలో , కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అంతకుముందు ఆయన సికింద్రాబాద్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు.
*
చిత్రం..కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
*
కదిలిందీ జనసైన్యం
అదిరిందీ రాజకీయ ఆశల సౌధం
బెదిరిన పార్టీలన్నీ
పదునగు వ్యూహాల కొరకు పరుగులు పెట్టెన్