రాష్ట్రీయం

సాగులో ఏపీ టాపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 22: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం గుంటూరు సమీపంలోని లాంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటుచేసిన కిసాన్‌మేళాను మంత్రి సోమిరెడ్డితో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు అధ్యక్షత వహించారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ ఏడాది మొదటి అర్ధ సంవత్సరంలో రాష్ట్రంలో వ్యవసాయరంగం 25.65 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సాగురంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు పంటలు వేయాలని సూచించారు. దేశంలో
ఏ రాష్ట్రంలోలేని విధంగా 54 లక్షల మంది రైతులకు భూసార పరీక్షా పత్రాలు అందజేశామన్నారు. భూసార పరీక్షల ఆధారంగా రైతులకు నూరుశాతం సబ్సిడీతో మైక్రో న్యూట్రిషన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత సమస్యలు అధికమైనా ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఎంపీఈఓల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. బిందుసేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందుకోసం 700 కోట్లు విడుదల చేశామన్నారు. రూ 5 వేల కోట్లతో వచ్చే నెలాఖరులోగా మూడోవిడత రుణమాఫీని పదిశాతం వడ్డీతో మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ రంగంలో అధునాతన టెక్నాలజీతో పరిశోధనలు నిర్వహిస్తోందని, అన్నిరకాల వ్యవసాయాన్ని సుసంపన్నం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రైతులు వ్యవసాయంలో మెళకువలు పాటించాలన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ 19వందల కోట్లు రైతులకు అందజేశామని, అనంతపురం జిల్లాకే రూ 1031 కోట్లు కేటాయించామని తెలిపారు. వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణకు పెద్దపీట వేస్తున్నామని, ఈ ఏడాది రైతు రథం పథకం కింద 12వేల 800 ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందించటం, కనీస మద్దతు ధరతో పాటు మార్కెట్ సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా రుణ మాఫీ పథకం కింద రూ 24 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. తెలంగాణలో పత్తి పంటకు గులాబీరంగు 50 శాతం మేర ఆశిస్తే మన శాస్తవ్రేత్తల కృషి ఫలితంగా కేవలం 5 శాతానికి తగ్గిందన్నారు. నకిలీ ఎరువులు, పురుగుమందులు, విత్తన విక్రేతలపై పీడీ యాక్టు నమోదుచేసి వారిని అరెస్టుచేయటంతో పాటు సంస్థలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్, రూ 24 కోట్లతో నిర్మించనున్న కాలేజ్ ఆఫ్ హోం సైనె్సస్, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ కల్చర్ భవన నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ కెఎస్ జవహర్‌లాల్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ దామోదరనాయుడు, విస్తరణ సంచాలకులు కె రాజారెడ్డి, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, జడ్పీ వైస్‌చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, లాం వ్యవసాయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్లు, శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. తొలుత కిసాన్‌మేళాలో పాల్గొన్న వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన వివిధ కంపెనీలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ప్రారంభించారు.

చిత్రం..గుంటూరులో నిర్వహించిన కిసాన్‌మేళాలో మాట్లాడుతున్న మంత్రి సోమిరెడ్డి