రాష్ట్రీయం

పరుగులు పెట్టిస్తున్న ‘పవన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: సార్వత్రిక ఎన్నికలకు గడువు ఇంకా సంవత్సరం పైనే ఉంది. కానీ సినీ నటుడు, జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందడితో మిగతా పార్టీలూ అప్రమత్తమవుతున్నాయి. ఎక్కడ వెనకబడి పోతామేమోనన్నది వారి భయం కావచ్చు. పవన్ కల్యాణ్ సోమవారం తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని యాత్ర ఆరంభించారు. పవన్ ప్రతి కదలికనూ అన్ని పార్టీలూ జాగ్రత్తగా గమనించాయి. 2009లో పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకుని యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే వాహనంపై యాత్రగా బయలుదేరిన పవన్ తలకు విద్యుత్తు తగలడంతో కొంత సేపు స్పృహ కోల్పోయారు. ఆ ప్రమాదం నుంచి ఆంజనేయ స్వామిని గట్టెక్కించారని బలంగా విశ్వసిస్తున్న పవన్ ఇప్పుడు కూడా ఆ స్వామిని దర్శించుకునే యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో జన సేన అభ్యర్థులను రంగంలోకి దింపితే? అనే చర్చ దాదాపు అన్ని పార్టీల్లోనూ ఆరంభమైంది. పవన్ ఎవరికి నష్టం చేస్తారు? అనే చర్చ జరుగుతున్నది. 2014 ఎన్నికల్లో చివరి నిమిషంలో పవన్ టిడిపికి మద్దతు ప్రకటించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘్ఢమాల్’ అంది. పవన్ పిలుపుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. కానీ ఈ దఫా తమ పార్టీ (జన సేన) పోటీ చేస్తుందని పవన్ పలు పర్యాయాలు ప్రకటించారు. తెలంగాణ గురించి ఆయన పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లోనూ తెలంగాణ గురించి ఆయన పట్టించుకోరనడానికి అవకాశమే లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేయించేందుకు సమాయత్తమవుతున్నారు.జనసేన బరిలో ఉంటే ఆంధ్రలో అధికారంలో ఉన్న టిడిపికి నష్టం కలుగుతుందా? లేక ఆ పార్టీకి మిత్రపక్షంగా మారిపోతుందా? అనే ఊహగానాలూ లేకపోలేదు. కానీ ‘తోక పార్టీ’గా మారిపోవడం ఇష్టం లేదని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులూ తేల్చేస్తున్నారు. జనసేన పోటీ చేస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంటుందని, కోలుకోవడానికి మరింత కష్టమవుతుందని మిగతా పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణలో జన సేన ఒంటరిగా పోటీ చేస్తే? ఏ పార్టీ ఓట్లు ఎక్కువగా చీలుతాయి? అనేది ప్రధాన ప్రశ్న. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న కొద్దిగో గొప్ప వ్యతిరేక ఓట్లనూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు చేరకుండా ఉండేందుకూ పవన్ పార్టీ ఉపయోగపడుతుందని టిఆర్‌ఎస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వ్యతిరేక ఓట్లను ప్రతిపక్ష పార్టీలే చీల్చుకుంటే, తమకు ఉన్న ఓటు బ్యాంకుతో మళ్లీ బ్రహ్మండంగా అధికారాన్ని కైవసం చేసుకోవచ్చనేది టిఆర్‌ఎస్ నేతల అంఛనా అనే ప్రచారం జరుగుతున్నది. కానీ దీనిని టిఆర్‌ఎస్ తోసిపుచ్చుతోంది. తమ పార్టీ అంత బలహీనంగా లేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సోమవారం విలేఖరుల సమావేశంలో తేల్చి చెప్పారు. జనసేన కూడా ఈ వాదనను తోసిపుచ్చుతున్నది. తమది చీల్చే పార్టీ కాదు, అధికారంలోకి వచ్చే పార్టీ అని అంటోంది. జనసేనకు భవిష్యత్తులో లభించే ఆదరణ, ఇతర పార్టీల నుంచి చేరికలు, కార్యకర్తలు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు, ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ఎదిరించేలా ఎన్నికల కార్యాచరణ, ప్రజాకర్షణ గల ప్రణాళిక (మ్యానిఫెస్టో) ప్రకటించడం వంటివి ఎనె్నన్నో చేయాల్సి ఉంటుంది. సాహసం చేయగల సత్తా పవన్‌కు ఉన్నా, అందుకు తగిన విధంగా స్క్రిప్టు సిద్ధం చేయాల్సిన సీనియర్ నేతల సలహాలు, సూచనలూ అవసరం ఉంటుంది. బిజెపి తెలంగాణ రాష్ట్ర కూడా పవన్‌తో ‘దోస్తీ’ చేసేందుకు ఉత్సాహంగానే ఉంది. మరోవైపు సకల జనుల ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ కూడా పవన్ నేతృత్వంలోని జనసేనను కలుపుకుని పోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఆ ఫ్రంట్ విషయంలో సిపిఐ, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కూడా చర్చలు జరిపారు.