రాష్ట్రీయం

తెలంగాణకు మీరే అంబాసిడర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణకు మీరే అంబాసిడర్లని, రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములు కావాలంటూ తెలంగాణ ప్రవాసభారతీయులకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె. తారక రామారావు విజ్ఞప్తి చేశారు. దావోస్‌లో జరగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం-2018’ సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్ జ్యూరిచ్ వెళ్లారు.
ఈ సందర్భంగా నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన ఎన్నారైల సమావేశంలో మాట్లాడుతూ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక యుద్ద ప్రాతిపదికన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నేతృతత్వంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు అమలవుతున్నాయన్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని ఇవ్వడం, ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ కింద తాగునీటిని అందించడం, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, వైద్య ఆరోగ్య రంగంలో పేదలకు చేరువుగా పథకాలు తీసుకుపోవడంతో సహా వివిధ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు కొనసాగుతున్నాయన్నారు. పారిశ్రామిక, ఐటి రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు జరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి నూతన సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకురావాలని, ఉత్తమమైన విధానాలను తీసుకురావాలని, పెట్టుబడులు పెట్టేవారిని ఆకర్షించాలంటూ ఎన్నారైలను కోరారు. సమావేశంలో హైదరాబాద్ మేయర్ బొంతురాంమోహన్ తదితరులు మాట్లాడారు. స్వీడన్, జర్మనీ, యుకె, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన తెలంగాణ ఎన్నారైలు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.

చిత్రం..వివిధ దేశాలకు చెందిన తెలంగాణ ఎన్నారైల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్