రాష్ట్రీయం

అడ్మిషన్లపై డేగకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: కనె్సషన్‌ల ఆశలు చూపుతూ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ అడ్మిషన్లకు టెన్త్ విద్యార్థుల వేటలో పడ్డాయి. రెసిడెన్షియల్ క్యాంపస్‌లో తక్కువ ఫీజులకే సీట్లు ఇస్తామని విద్యార్ధులకు ఆశ చూపుతున్న కార్పొరేట్ కాలేజీలు అపుడే కొంత ఫీజును వసూలు చేసి అడ్మిషన్లను ఖరారు చేస్తున్నాయి. పదో తరగతి అసలు పరీక్షలు ప్రారంభం కాకముందే వివిధ పాఠశాలల్లో జరిగిన ఇంటర్నల్స్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను గుర్తించి వారికి ఉచిత సీట్లు కేటాయిస్తామని ఆశ చూపుతున్నాయి. ప్రతి ఏడాది ఈ తంతు ముందే మొదలవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం ఆన్‌లైన్‌లో ఇంటర్ అడ్మిషన్లు చేపట్టనున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు లెక్క చేయకుండా తమ అడ్మిషన్ల తంతును ముగిస్తున్నాయ. ఈ నేపథ్యంలో ముందే జరిగే అడ్మిషన్లను తాము గుర్తించేది లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ హెచ్చరించారు. 2018-19 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏ కాలేజీ ఎలాంటి అడ్మిషన్లను చేపట్టవద్దని, అడ్మిషన్లకు సంబంధించి బోర్డు ప్రత్యేక షెడ్యూలును ప్రకటిస్తుందని ప్రకటించారు. ముందే అడ్మిషన్లు చేపడితే సహించేది లేదని కూడా హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా ముందే జరుగుతున్న అడ్మిషన్లకు సహకరించవద్దని, బోర్డు షెడ్యూలు ప్రకటించిన తర్వాత మాత్రమే అడ్మిషన్లను తీసుకోవాలన్నారు.
గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ముందే బోర్డు పోర్టల్‌లో ఉంచుతామని, గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. గతంలో గుర్తింపు లేని కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టి లేని పోని సమస్యలను విద్యార్థులు కొనితెచ్చుకున్నారని అదే పరిస్థితి ఈ ఏడాది లేకుండా చూసేందుకే చర్యలు చేపట్టామని అన్నారు. బోర్డు ఇన్ని సూచనలు చేసినా, నారాయణ, శ్రీ చైతన్య, గౌతమి, నలందా, కృష్ణవేణి, శ్రీ గాయత్రి, భాష్యం, శ్రీ మేథ, వెలాసిటీ, బ్రిలియంట్, ఫిట్జీ వంటి కార్పొరేట్ , ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోవడం గమనార్హం.