రాష్ట్రీయం

అంకితభావంతో పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: నిజాయితీ, అంకితభావంతో పని చేసి, మీపై రైల్వే శాఖ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని రైల్వే బోర్డు సిగ్నల్, టెలికం డైరక్టర్ జనరల్ అఖిల్ అగర్వాల్ ఇండియన్ రైల్వే సర్వీస్ సిగ్నల్ ఇంజినీరింగ్ (ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈ)లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సూచించారు. రైల్వేలో అత్యంత కీలకమైన పాత్ర వహించే సిగ్నల్, టెలికం విభాగంలో ఆఫీసర్లుగా ఉద్యోగాల్లో చేరబోతున్న యువకులంతా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 17 మందిలో 4 మహిళలు ఉండడం విశేషమని అన్నారు. మీరంతా మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. సోమవారం నాడిక్కడ ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్)లో శిక్షణ పూర్తి చేసుకున్న 17 మంది ప్రొబెషనర్ల పాసింగ్ ఔట్ కార్యక్రమానికి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్ట్ఫికెట్లు, ప్రతిభ కనబర్చిన వారికి నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను ఆయన అందజేశారు. 2015 బ్యాచ్‌కి చెందిన ఈ 17 మందితో పాటు మరో ఇద్దరు కూడా సర్ట్ఫికెట్లు తీసుకోవాల్సి ఉందని, కానీ దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు శిక్షణకు సంబంధించిన కోర్సులో ఉత్తీర్ణులు కాలేకపోయారని అన్నారు. అత్యంత కీలకమైన, కఠినమైన శిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని, రైల్వేలో ముఖ్యమైన సిగ్నలింగ్, కమ్యూనికేషన్ విభాగంలో ప్రతిభ ఉండాలని చెప్పారు. ఆ ఇద్దరు కూడా త్వరగా శిక్షణ పూర్తి చేసుకుని బయటకు రావాలని అన్నారు. విధి నిర్వహణలో ఎంతైతే అంకితభావంతో పని చేస్తారో పని చేసే చోట సహచర ఉద్యోగులను కలుపుకుని అదే స్ధాయిలో పని చేసుకుపోవాలని అన్నారు. ఒక విభాగానికి అధిపతిగా కాకుండా అక్కడ పనిచేసే వారందరి సంక్షేమానికి కృషి చేసే విధంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా సీనియర్లను గౌరవిస్తూ వారి నుంచి విధి నిర్వహణలో అవసరమైన సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రైల్వే బోర్డు అదనపు సభ్యుడు (టెలికం) హెచ్‌కె అగర్వాల్ మాట్లాడుతూ రైల్వే సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్ధలో పెనుమార్పులు చేసుకున్నాయని, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం జరుగుతోందని అన్నారు. ఇందుకు అనుగుణంగా శిక్షణ పొందిన యువ అధికారులంతా బాగా పని చేసి పేరుతెచ్చుకోవాలని అన్నారు.
రోజు రోజుకీ రైల్వేపై అంచనాలు పెరుగుతున్నాయని, ఇందుకు అనుగుణంగా పని చేసి మీకు మీరుగా పేరుతెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సిగ్నల్ అదనపుసభ్యుడు ఎన్.కాశీనాథ్, ఇరిసెట్ అధికారులు, శిక్షణ అందించిన వారు పాల్గొన్నారు. తొలుత ఇరిసెట్ డైరక్టర్ ఎల్‌పి సిన్హా స్వాగతోపన్యాసం చేశారు. పలువురు శిక్షణ పొందిన ప్రొబెషనర్లు తమ శిక్షణ అనుభవాలను, బాధ్యతల గురించి ప్రసంగించారు.
చిత్రం..రైల్వే సర్వీస్ సిగ్నల్ ఇంజినీరింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేస్తున్న సిగ్నల్, టెలికం డైరక్టర్ జనరల్ అఖిల్ అగర్వాల్