రాష్ట్రీయం

శ్రీకాళహస్తిలో వేడుకగా తై అమావాస్య ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి : తై అమావాస్య సందర్భంగా శ్రీ కాళహస్తి క్షేత్రంలో సోమవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. శ్రీ కాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను సమీపంలోని భరద్వాజ తీర్థంలోకి తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. నవభారత్ యువజన సంఘం వారు అన్నదానం నిర్వహించారు. దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు, ఇఓ భ్రమరాంబ, దేవస్థానం సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను పట్టణంలో ఊరేగించారు. శనివారం నుంచి కొనసాగుతున్న రద్దీ సోమవారం మరింత పెరిగింది. తై అమావాస్య కావడంతో తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో నిండిపోయింది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. తై అమావాస్య ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ కాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్నవరదరాజస్వామి ఆలయంలో సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజ స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లి జయరామరావు వీధిలోని వైష్ణవ కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెప్పలను పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు, టపాసుల మోతల మధ్య తెప్పోత్సవం వైభవంగా జరిగింది.

భీమిలిలో మహోదయ పుణ్యస్నానాలు

విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి వద్ద గోస్తనీ సంగమ ప్రాంతంలో విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సోమవారం ఉదయం మహోదయ స్నానాలు ఆచరించి పితృ దేవతలకు తర్పణం వదిలారు. విశేష ఫలాలు ఒనగూరే ఇటువంటి పుణ్యస్నానాలను ఆచరించడం ద్వారా ప్రజలు తమ మనోభీష్టాలను నెరవేర్చుకోవడంతో పాటు వారి పితృదేవతలకు సంపూర్ణ స్వర్గ ప్రాప్తిని కల్పించేందుకు దోహదపడతాయని ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర అనుగ్రహభాషణం చేశారు.

కన్నుల పండువగా సింహాచలేశుని తెప్పోత్సవం

సింహాచలం, ఫిబ్రవరి 8 : పుష్య బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి నౌకా విహారోత్సవం సోమవారం కన్నుల పండువగా జరిగింది. సింహాద్రినాథుడు వేణుగోపాలస్వామి అలంకరణతో ఉభయదేవేరులతో కూడి వరాహ పుష్కరిణిలో విహరించారు. నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, దేదీప్యమానమైన బాణా సంచా వెలుగుల నడుమ అమ్మవారితో కలిసి స్వామివారు హంస వాహనంలో విహరిస్తూ ఉంటే భక్తకోటి గోవిందనామస్మరణ చేశారు. పుష్కరిణి మధ్యలో ఉన్న మండపం చుట్టూ మూడుసార్లు స్వామివారు విహరించారు. అనంతరం మండపంలో స్వామివారిని దేవేరులను అధిష్ఠింపపజేసి సంప్రదాయ పూజలు చేశారు. ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడపర్తి గోపాలకృష్ణమాచార్యుల నేతృత్వంలో అర్చకులు వైదికాదికాలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీ దంపతులు, తెలుగు చిత్రసీమ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకున్నారు. మంత్రి గంటా, ఎంపి అవంతి స్వామివారి పల్లకి మోశారు. అంతకుముందు దేవాలయంలో విశేష పూజలు పూర్తి చేసి స్వామివారిపై దేవేరులను పల్లకిలో కొండదిగువకు తీసుకువచ్చారు. తొలి పావంచా వద్ద ఈవో రామచంద్రమోహన్ భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు. ఉదయం పుష్కరిణీ వద్ద పూజలు, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించి అర్చకులు మహా సంప్రోక్షణ చేశారు. పుష్కరిణి నుండి బిందెలతో జలాలను బయటకు పోసి శుద్ధి చేశారు. తెప్ప తిరునాళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకొని పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన సంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నమాచార్య కీర్తనలతో వేంకటేశ్వరస్వామి వారి వైభవాన్ని కీర్తిస్తూ నృత్యం చేసిన చిన్నారులు అందర్ని మంత్రముగ్దుల్ని చేశారు.
పుష్కరిణిలో హంస వాహనంపై నౌకావిహారోత్సవం ముగించుకున్న స్వామివారు రాత్రి సర్వజన మనోరంజని వాహనంలో పురవీధుల్లో ఊరేగారు. భక్తులంతా ఇళ్ళముందు రంగవల్లులు వేసి హారతులిచ్చి స్వామికి స్వాగతం పలికారు.

టిటిడి డిప్యూటి ఇఓ ఇంట్లో ఏసిబి సోదాలు
కోట్ల విలువచేసే ఆస్తులు గుర్తింపు

తిరుపతి, ఫిబ్రవరి 8: తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో డిప్యూటీ ఇఓగా పనిచేస్తున్న భూపతిరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న సమాచారంపై సోమవారం మధ్యాహ్నం ఆయన ఇంటిపైన, బంధువుల ఇళ్లపైన ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోమవారం రాత్రంతా సోదాలు జరిగే అవకాశాలున్నాయి. ఈక్రమంలో బెంగళూరు, తిరుపతిలో ఉన్న ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో కూడా ఆయనపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించిన విషయం విదితమే. కాగా భూపతిరెడ్డి గతంలో టిటిడిలో కీలకమైన స్థానాల్లో పనిచేశారు. తిరుచానూరులో కూడా ఒక లాడ్జి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

కాపులను బిసిలో
చేర్చాలంటూ ఆత్మహత్య
సిఎస్ పురం, ఫిబ్రవరి 8: కాపులను బిసిలో చేర్చాలంటూ వ్యక్తి ఆత్మచేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన సిఎస్‌పురంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన రమణయ్య (55) గత మూడు రోజులుగా తిండి, నిద్రహారాలు మానేసి తమ కాపు వర్గీయులను బిసిల్లో చేర్చేంత వరకు పోరాడతానని చెప్పినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అకస్మాత్తుగా సోమవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే కదిరి బాబురావు సందర్శించి, టిడిపి కార్యకర్త అయిన రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, రమణయ్య ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.