రాష్ట్రీయం

విద్యార్థుల ఆత్మహత్య కేసులో తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు చదువుల వత్తిడితో మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ కేసులో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు నారాయణ, శ్రీచైతన్య కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం గంగారావు విచారించారు. ప్రకాశం జిల్లాకు చెందిన లోక్‌సత్తా నేత దాసరి ఇమాన్యుయేల్ పంపిన లేఖను హైకోర్టు విచారించింది.
రెండురాష్ట్రాల్లో చాలా వరకు ప్రైవేట్ కాలేజీలు ఆంధ్రాకు చెందిన మంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు. విద్యార్ధుల ఆత్మహత్యలపై కమిటీని నియమించినట్లు ఆంధ్రప్రభుత్వం ప్రకటించినా, ఇంతవరకు ఆ నివేదిక తయారు కానట్లు అనిపిస్తుందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నోటీసులు ఇచ్చిన అనంతరం హైకోర్టు అఫిడవిట్లు దాఖలుచేసేందుకు మూడు వారాలు గడువు ఇస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.