రాష్ట్రీయం

శాంతించిన ‘గోదావరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం/కాకినాడ, ఫిబ్రవరి 8: కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు సోమవారం దీక్ష విరమించటంతో గోదావరి జిల్లాలు సద్దుమణిగాయి. ఈనెల 31న తునిలో కాపు ఐక్య గర్జన బహిరంగ సభ సందర్భంగా విధ్వంసం జరిగినప్పటి నుండి గోదావరి జిల్లాల కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏ సమయంలో ఎలాంటి ఆందోళనలు చెలరేగుతాయి? ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తుతాయో తెలియని అనిశ్చితి నెలకొనటంతో గోదావరి జిల్లాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సంఘటనల నేపథ్యంలో 5నుండి ముద్రగడ పద్మనాభం దంపతులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఉభయగోదావరి జిల్లాల్లో రోజు రోజుకూ కాపు సామాజికవర్గానికి చెందిన యువకులు ఎక్కడికక్కడ నిరాహార దీక్షా శిబిరాలను ఏర్పాటుచేయటం, చివరకు మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉద్యమంలో పాల్గొనటంతో రోజులు గడిచే కొద్దీ పోలీసుల పరిస్థితి కత్తిమీద సాముగా తయారయింది. సెక్షన్ 30, 144సెక్షన్లు అమలులో ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా రోడ్డెక్కి ఆందోళనలు సాగించటంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయోనని ఇతర వర్గాలు ఆందోళన చెందాయి. బిసి జాబితాలో చేర్చాలని కాపు సామాజికవర్గం నాయకులు ఆందోళన సాగిస్తుంటే, కాపులను బిసిల్లో చేరిస్తే ఉద్యమిస్తామని బిసి వర్గాలు ఆందోళన చేపట్టడం ఇబ్బందికరంగా తయారయింది. గోదావరి జిల్లాల్లో అటు బిసి సామాజికవర్గాలు, ఇటు కాపు సామాజికవర్గం రెండూ బలమైనవే కావటంతో ముద్రగడ దీక్ష కొనసాగినంత కాలం అన్ని చోట్లా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మరోపక్క గత 31వ తేదీ నుండి సోమవారం రాత్రి వరకు పోలీసు సిబ్బంది, అధికారులు ప్రశాంతంగా లేరు. 24గంటలూ విధుల్లోనే ఉంటూ ఏ సమయంలో ఎలాంటి ఆందోళనలు చెలరేగుతాయోనన్న ముందుచూపుతో వ్యవహరించారు. కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్న గ్రామాల్లో గత నాలుగు రోజులుగా మహిళలు, వృద్ధులు కూడా రిలేనిరాహార దీక్షలు చేస్తూ ఆందోళనలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం దంపతులు దీక్ష విరమించటంతో ఒక్కసారిగా గోదావరి జిల్లాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు, నిర్బంధాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను సోమవారం రాత్రికి ఎత్తివేశారు. బిక్కు బిక్కు మంటూ గత వారం రోజులుగా గడిపిన గోదావరి జిల్లాలు ముద్రగడ దీక్ష విరమణ ప్రకటనతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి.

నారాయణ్‌ఖేడ్‌లో
ఇవిఎంలు వద్దు
పేపర్ బ్యాలెట్ లేదా
ప్రింటర్ ఇవిఎంలను వినియోగించండి
సిఇసికి టిపిసిసి అధ్యక్షుడు
ఉత్తమ్ కుమార్‌రెడ్డి వినతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 8: నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవ్గం ఉప ఎన్నికలో ఇవిఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్లను లేదా ప్రింటర్ ఇవిఎం (వివిఎపిటి)లను వినియోగించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కోరారు. ఈ రెండింటిలో దేనినయినా అమలు చేయడానికి సమయం సరిపోదని భావిస్తే ఉప ఎన్నిక తేదీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన వరంగల్ ఉప ఎన్నిక, ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి ఉప ఎన్నికల్లో ఇవిఎంలు ట్యాంపరింగ్ జరిగి ఫలితాలు తారుమారయ్యాయని ఆయన ఆరోపించారు. అందువల్ల నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలో ఇవిఎంలను వినియోగించవద్దని ఆయన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రతిని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పత్రికలకు విడుదల చేశారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్‌కు వరంగల్ ఉపఎన్నిక సమయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వివిపిఏటిలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇవిఎంలు ట్యాంపరింగ్ జరిగాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ, బిహార్ ఎన్నికల్లో వివిపిఎటిలను ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ఉత్తమ్ ప్రశ్నించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో చాలా చోట్ల ఓటింగ్ మిషన్‌లో తాము ఓటు చేసిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు పడినట్లు కొందరు ఓటర్లు తమ పార్టీ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో వివిపిఎటిలను వినియోగించి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరారు.
రూ. 2లక్షల విలువైన
గుట్కాల పట్టివేత
స్టేషన్ ఆవరణలోనే దగ్ధం
కామారెడ్డి, ఫిబ్రవరి 8: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో సోమవారం రాత్రి పక్కా సమాచారం మేరకు సిఐ కె.శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐలు రెండు గ్రూపులుగా విడిపోయి పాన్‌షాపుల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 8 పాన్ కోకాషాపుల్లో 2 లక్షల రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్‌లు పట్టుబడినట్లు సిఐ తెలిపారు. పట్టుకున్న గుట్కా ప్యాకెట్‌లను, పాన్ కోకా యజమానులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, గుట్కాప్యాకెట్‌లను స్టేషన్ ఆవరణలోనే దగ్ధం చేశామన్నారు. గుట్కా ప్యాకెట్‌లను అమ్ముతున్న కోకాల యజమానులకు మొదటి తప్పుగా భావించి 500 రూపాయలనుంచి 5 వేల రూపాయల వరకు జరిమానాలు వేసి వదిలినట్లు సిఐ తెలిపారు.