తెలంగాణ

సినిమాలకు సింగిల్ విండో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి అన్ని అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మినీ కల్చరల్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని, సినీ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆలోచిస్తోంది. సినిమా రంగ పరిశ్రమపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ కమిటీ తొలి సమావేశం బుధవారం జరుగుతుంది. సమావేశంలో సినిమా రంగానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లో ప్రస్తుతం రోజుకు ఐదు సినిమాలు ప్రదర్శిస్తున్నారు. థియేటర్లలో నాలుగు ప్రదర్శిస్తున్నారు. థియేటర్లలో కూడా ఐదు సినిమాలను ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చే అంశంపై చర్చిస్తారు. ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల నుండి పొందే లైసెన్స్‌కు ఫీజును పదివేల నుంచి ఐదు వేలకు తగ్గిస్తారు. ఈ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. సినిమా వారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. బుధవారం కమిటీ సమావేశం అవుతుంది. నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటారు.