తెలంగాణ

వాల్‌మార్ట్‌తో మూడు ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ప్రపంచంలోనే అతి పెద్దదైన రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఉపాధ్యక్షుడు, లాటిన్ అమెరికా, ఆఫ్రికా సిఇఓ ఎన్‌రిక్ ఓస్టల్ తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావును సచివాలయంలో మంగళవారం కలిశారు. భారతదేశంలో వాల్‌మార్ట్ విస్తరణ ప్రణాళికను వివరించారు. హైదరాబాద్ నగరంలో మరిన్ని వాల్‌మార్ట్ స్టోర్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు. దీనికోసం అవసరం అయిన స్థలాలను ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. వాల్‌మార్ట్ త్వరలోనే భారతదేశంలో రిటైల్ రంగం సేవలతో పాటు వైద్య, నైపుణ్య శిక్షణ రంగాల్లోకి విస్తరించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో వాల్‌మార్ట్ విస్తరణకు అవసరం అయిన సహకారం అందిస్తామని కెటిఆర్ తెలిపారు. వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో మహళల కోసం కిరాణా దుకాణాలు ప్రారంభించి, వారిని పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దేందుకు ఒక కార్యక్రమం తీసుకు రానున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం- వాల్‌మార్ట్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు కెటిఆర్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హార్టికల్చర్ ద్వారా కూరగాయలు, పండ్లు సరఫరా చేసేందుకు మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రభుత్వం సెర్ఫ్ (గ్రామీణ ఉపాధి నిర్మూలన సంస్థ) ద్వారా చేపట్టిన కృషి మార్ట్‌ల నిర్వహణ, మెళకువల అభివృద్ధి కోసం వాల్‌మార్ట్ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ మూడు ఎంఓయులకు సంబంధించి ఈ నెలాఖరునాటికి ఒప్పందాలు పూర్తవుతాయని తెలిపారు. సమావేశంలో ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.
కెటిఆర్‌ను అభినందించిన ఐటి ప్రముఖులు
ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె తారక రామారావు నూతనంగా మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ఐటి ప్రముఖులు సచివాలయంలో మంగళవారం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన మంత్రి నాయకత్వాన్ని అభినందించారు. హైదరాబాద్ నగరానికి కొత్త నాయకత్వం దొరికిందని, నగరాన్ని సమూలంగా మార్చేందుకు ఐటి పరిశ్రమ తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. నగరంలో ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా కొంత భాగస్వామ్యం అందిస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. ఐటి కారిడార్‌లోని రహదారులు, దుర్గం చెరువు సుందరీకరణ వంటి అంశాల్లో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని ఐటి పరిశ్రమ ప్రముఖులు మంత్రికి తెలిపారు.

మంగళవారం సచివాలయంలో తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్‌తో
సమావేశమైన వాల్‌మార్ ట ఉపాధ్యక్షుడు ఎన్‌రిక్