రాష్ట్రీయం

పవర్‌గ్రిడ్‌పై కీలక సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పవర్‌గ్రిడ్ పరిస్థితిపై విశాఖ నగరంలో కీలక సమీక్ష జరగనుంది. దక్షిణ ప్రాంత సమన్వయ కమిటీ, ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో దీనిని వచ్చేనెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. దక్షిణ ప్రాంతాలకు సంబంధించి పవర్‌గ్రిడ్ బెంగళూరులో ఉంది. దీని నిర్వహణ ఏ విధంగా ఉంది, వైఫల్యం చెందితే పలు రాష్ట్రాల విద్యుత్ సరఫరాపై చూపే ప్రభావం, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై విశాఖలో జరిగే సమీక్షలో కీలకంగా చర్చించనున్నారు. ఒక్కసారిగా విద్యుత్ లోడ్ పెరిగినా, ఫ్రీక్వెన్సీ తగ్గినా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎటువంటి సాంకేతికపరమైన సమస్య నెలకొన్నా దీని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. చివరకు గ్రిడ్ విచ్ఛినమయ్యే పరిస్థితులున్నందున అతి సున్నితమైన సమస్యగా తీసుకుంటున్న దీని నిర్వహణపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. ఇటువంటి కీలకమైన గ్రిడ్ నిర్వహణపై సమన్వయ కమిటీ ప్రతినిధులు, డిస్కంల సిఎండిలు రెండు రోజులపాటు సుదీర్ఘ చర్చ జరుపనున్నారు. కర్ణాటక, గోవా, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 80 మంది సమన్వయ కమిటీ ప్రతినిధులు, మరో 12 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు చెందిన సిఎండిలు ఈ సమీక్షలో పాల్గొంటారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ సమీక్ష జరగటం ఇదే తొలిసారి.