రాష్ట్రీయం

కాంగ్రెస్‌లోనే కోట్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 9: పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి క్షమాపణ చెప్పామని ఎఐసిసి కార్యదర్శి తిరునావుక్కరసు స్పష్టం చేశారు. అనంతపురంలో రాహుల్ గాంధీ సభ సందర్భంగా జరుగకూడని సంఘటన జరిగిందని విచారం వ్యక్తం చేశారు. కర్నూలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కోట్ల సూర్య అవమానంగా భావించిన విషయం సోనియా, రాహుల్‌గాంధీలకు కూడా తెలిసిందని దాంతో వారు తనను పంపారన్నారు. గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు కోట్ల కుటుంబం ఎన్నో సేవలు చేసిందన్నారు. నిజాయితీని నమ్ముకున్న దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆయన కుమారుడు కోట్ల సూర్య అంటే సోనియా, రాహుల్‌గాంధీలకు ఎంతో అభిమానమన్నారు. ఆయన మనసు బాధ పడిందని తెలిసిన వెంటనే క్షమాపణ చెప్పాలని తనను పంపారన్నారు. అనంతపురంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కోట్ల సూర్య వేదికపైకి రాలేకపోయారన్నారు. దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ తన ఊపిరి పోయే వరకు కాంగ్రెస్ పార్టీ వీడే ప్రశే్నలేదని తేల్చి చెప్పారు. కొందరు నాయకుల కారణంగానే తాను వేదికపైకి ఎక్కలేకపోయానన్నారు. అయితే కార్యకర్తలు తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆందోళన వ్యక్తం చేశారన్నారు. తనకు అండగా నిల్చిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మాజీ మంత్రి శైలజానాథ్, డిసిసి అధ్యక్షుడు బివై రామయ్య పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తిరునావుక్కరసు.
చిత్రంలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

మమ్మల్నీ బిసిల్లో చేర్చండి
రెడ్డికాపు సంఘం డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 9: రాష్ట్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులను బిసిల్లో చేర్చాలనే నినాదం దాదాపు సఫలీకృతం కావడంతో సీమ జిల్లాలకు చెందిన రెడ్డి సామాజికవర్గం కూడా తమను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. కడప జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గం తాము కూడా సీమలో వెనుకబడిన వారమేనని, తమకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి కాపు సంక్షేమ సంఘం నాయకుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి మంగళవారం కడపలో విలేఖరులతో మాట్లాడుతూ కడపజిల్లాలో అసలైన కాపులం తామేనని పేర్కొన్నారు. దీన్ని అనుసరించి తమను కూడా కాపు సామాజికవర్గంతోపాటు బిసిలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గత రెండురోజులుగా జిల్లా వ్యాప్తంగా రెడ్ల సామాజికవర్గం కార్యకర్తలు విస్తృతంగా తమ కులానికి చెందిన ప్రముఖులతో సమాలోచనలు చేశారు. తమకూ బిసి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశాభివృద్ధే ప్రధాని లక్ష్యం: పురంధ్రీశ్వరి
కల్లూరు, ఫిబ్రవరి 9: భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోది పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి మహిళామోర్చా అద్యక్షురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి తెలిపారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సుకు పురంధ్రీశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ యువత ఆలోచనలను సాకారం చేసేందుకు మేకిన్ ఇండియా పథకాన్ని ప్రవేశ పెట్టిందని,చిన్నతరహా పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ్భారత్ ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా ఉందన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం మెండుగా ఉందని, సెంట్రల్ యూనివర్సిటీలు కేంద్ర ప్రభుత్మం మంజూరు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. వీటికి తోడు అన్ని వర్గాల ప్రజల మేలు కాక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలన్నీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

అరటి తోటకు నష్టపరిహారం ఎప్పుడిస్తారు?
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 9: పొలాలు చదును చేసే సమయంలో భూ సమీకరణకు అప్పగించని రైతుకు సంబంధించిన 7 ఎకరాల అరటితోటను ట్రాక్టర్లతో దున్ని, ధ్వంసం చేసిన సిఆర్‌డిఎ అధికారులు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించి, నెలలు గడుస్తున్నప్పటికీ పట్టించుకోక పోవడంపై రైతు జి రాజేష్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ముందస్తు సమాచారం ప్రకారం మంగళవారం సిఆర్‌డిఎ, వ్యవసాయశాఖ, ఉద్యానవన, ఆర్‌అండ్‌బి, సర్వేశాఖలకు సంబంధించిన అధికారులు అరటితోటను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేయాల్సి ఉంది.