క్రైమ్/లీగల్

నల్లగండ్ల చెరువు పూర్తి స్ధాయి చెరువుమట్టం వద్ద నిర్మాణాలు అనుమతించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో నల్లగండ్ల చెరువుపూర్తి స్థాయి నీటి మట్టం కొలతను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ఎక్కడ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు జిహెచ్‌ఎంసిని ఆదేశించింది.
జనం కోసం అనే స్వచ్చందసంస్థ అధ్యక్షఉడు కాశిరెడ్డి భాస్కరరెడ్డిదాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం విచారించింది. నల్లగండ్ల పెద్ద చెరువు89 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ఈ చెరువు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ఈ చెరువుసహజ ప్రకృతి వనరులతో అలరారే విధంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ అభ్యర్థించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్ హరినాథ్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. ఒక అపార్డుమెంట్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఈ చెరువుకు చందన శికం భూములను కొనుగోలు చేసిందని అపార్టుమెంట్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఈ చెరువును పరిరక్షించాలని హైకోర్టు జిహెచ్‌ఎంసిని ఆదేశించింది. జిహెచ్‌ఎంసి అధికారులు, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి, కన్‌స్ట్రక్షన్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల పాటు కేసు విచారణనను వాయిదా వేశారు.