రాష్ట్రీయం

గీతంలో యుజి, పిజి అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్‌లో ఎమ్మెస్సీ, బిఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జిఎ రామారావు తెలిపారు. పచ్చదనంతో కూడిన ఆహ్లాదరకమైన వాతావరణంలో ప్రపంచశ్రేణి వౌలిక సదుపాయాలతో నిర్మించిన అధునాతన భవనంలో మాథ్స్ -కంప్యూటర్ సైన్స్ కామన్ సబ్జెక్టులుగా నిర్మిస్తున్న బిఎస్సీతో పాటు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యుటికల్ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు. కనీస అర్హత పరీక్షను 50 శాతం మార్కుల సగటుతో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని చెప్పారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 44750 మంది హాజరు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 12వ రోజున 44,750 మంది హాజరయ్యారని కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. వీరికోసం 479 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.