రాష్ట్రీయం

వ్యవసాయ జోన్‌పై రైతుల అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 10: గుంటూరు జిల్లాలోని 18 మండలాలను వ్యవసాయ జోన్‌లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంపై అన్నదాతల నుండి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ మండలాలను రాజధాని ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో మరికొన్ని మండలాలను వ్యవసాయ జోన్‌లుగా ప్రకటించింది. ఆయా మండలాల్లో వ్యవసాయం మినహా మరొక కార్యక్రమం చేపట్టడానికి వీలులేకుండా ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులు వేల సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తంచేశారు. 2050 వరకు వ్యవసాయ జోన్‌లను మార్పు చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తున్న దృష్ట్యా రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చింది. అయితే రైతులు లిఖితపూర్వకంగా సుమారు 7 వేలకు పైగా అభ్యంతరాలను అందజేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ గ్రామాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ముందస్తు సమాచారం మేరకు మరికొద్దికాలం గడువు పొడిగించాలని భావిస్తోంది. అందులో భాగంగా మరో రెండు నెలలు గడువు పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.గుంటూరు జిల్లాలోని వ్యవసాయజోన్ -1 కింద పెదకాకాని, వట్టిచెరుకూరు, చేబ్రోలు, ప్రత్తిపాడు, చుండూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర, పొన్నూరులో కొంతభాగం ఉన్నాయి. వ్యవసాయ జోన్ -2 కింద తాడికొండ, అమరావతి, మేడికొండూరులో కొంతభాగం ఉన్నాయి. వ్యవసాయ జోన్ -3లో అచ్చంపేట, క్రోసూరు, ఫిరంగిపురం, పెదకూరపాడు, యడ్లపాడు మండలాలను ప్రభుత్వ ప్రకటించడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.ప్రభుత్వం ప్రకటిస్తున్న విధంగా వ్యవసాయానికి మండలాలు పరిమితం కావాలని ఆదేశించడం రైతులకు మింగుడు పడటం లేదు. రాజధానికి, పట్టణాలకు, నగరానికి సమీపంగా ఉన్న మండలాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ బూమ్ పుంజుకుంది. రాజధాని ప్రకటనతో అనేక మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తృతమైంది. అమరావతి మండలాన్ని ఉదాహరణగా తీసుకుంటే రాష్ట్రప్రభుత్వం రాజధాని ప్రాంతంగా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలను ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో విస్తృతంగా జరిగింది. ప్రభుత్వం ఒక దశలో అమరావతిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పూర్తిస్థాయిలో నిలిపి వేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2050 వరకు 18 మండలాలను వ్యవసాయ జోన్‌లుగా ప్రకటించడం ఎంతమాత్రం సమంజసం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.