రాష్ట్రీయం

ప్రైవేటు బెదిరింపులకు లొంగేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చేసే హెచ్చరికలను లెక్క చేసేది లేదని, అలాంటి బెదిరింపులకు లొంగేది లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణకు తాము సహకరించబోమని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కడియం శ్రీహరి శనివారం నాడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ కాలేజీల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వ కేంద్రాల్లోనే పేపర్లు దిద్దాలని, ఇన్విజిలేటర్లుగా, వాల్యుయేషన్ అధికారులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులను, అధ్యాపకుల సేవలనే వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. హైస్కూళ్లు, జిల్లా పరిషత్ స్కూళ్లు, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రస్తుతం ఫర్నీచర్ బావుందని, వీలైనంత వరకూ పరీక్ష కేంద్రాలను అక్కడే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజు రియంబర్స్‌మెంట్ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే ఇవ్వకపోతే పరీక్షలను బహిష్కరిస్తామని కెజి టు పిజి విద్యాసంస్థల జెఎసి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు
ఇచ్చారు. పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడం కూడా పూర్తిగా ప్రభుత్వ సంస్థల్లోనే జరగాలని చెప్పారు. ఇన్విజిలేటర్లుగా వీలైనంత వరకూ ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులనే నియమించాలని అన్నారు. పేపర్లు దిద్దడంలో కూడా పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలే వినియోగించుకోవాలని చెప్పారు. వీటికి సంబంధించి సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించుకుని రావాలని, అధికారులకు సూచించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య సంచాలకుడు జి కిషన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
అందరికీ హెల్త్ కార్డులు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్యంపై సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శనివారం నాడు ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటాలజిస్టుల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కడియం శ్రీహరి ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు అందరికీ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, విద్యాశాఖ ద్వారా వారికి ఆరోగ్య కార్డులను అందించాలనే ప్రయత్నంలో ఉన్నామని అన్నారు. కెసిఆర్ కిట్స్‌తో పాటు రాష్ట్రంలోని గర్భిణీలకు ఆరు నెలల పాటు నెలకు రెండు వేలు చొప్పున చెల్లిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ కరుణాకర్, ఇతర వైద్యులు పాల్గొన్నారు. తొలుత కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు.

చిత్రం..పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో చర్చిస్తున్న కడియం