రాష్ట్రీయం

26నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్ట ఈ నెల 26 మొదటి విడత బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించింది. శనివారం గాంధీ భవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పిసిసి ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశంలో బస్సు యాత్రపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 26న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బస్సు యాత్రను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం వికారాబాద్ చేరుకోవాలని, మర్నాడు అంటే 27న తాండూరు, సంగారెడ్డిలో, 28న జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 1నుంచి
3వ తేదీ వరకు హోళి పండుగ కారణంగా బస్సు యాత్రకు విరామం ఇచ్చి, తిరిగి 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కొనసాగించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత తిరిగి ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకూ రెండో విడత యాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు సీనియర్ నాయకులైన భట్టివిక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రలు నిర్వహిస్తారు. ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంత రావు రాష్ట్రంలో రథ యాత్ర చేపడతారు. ఈ యాత్రలన్నీ జూన్ 1న ముగించుకుని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న భారీ బహిరంగ సభ వరంగల్ లేదా హైదరాబాద్‌లో నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ బహిరంగ సభకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారు.