రాష్ట్రీయం

ఎస్సారెస్పీకి 1067 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పి)లో భాగమైన వరద కాలువ నుండి కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో చెరువులను నింపేందుకు ప్రభుత్వం బృహత్ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉండగా వరద కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కాలువ నిర్మాణమే దశాబ్దకాలంగా కొనసాగింది. ఎస్‌ఆర్‌ఎస్‌పి పూర్తిస్థాయిలో నిండితే వరద కాలువకు అదనపు నీటిని విడుదల చేస్తారు. ఈ నీటిని ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా వినియోగిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని ఎతె్తైన ప్రాంతాల్లో చెరువులకు నీటిని అందించేందుకు కేసిఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో వరద కాలువపై 11 చోట్ల తూములను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ తూముల ద్వారా జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని చెరువులకు నీటిని విడుదల చేస్తారు. ఇందుకోసం 1067 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులను ఇచ్చారు. ఎత్తిపోతలతోపాటు కాలువను కూడా పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించామని హరీశ్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద కాలువ దారిలో ఉన్న చెరువులకు నీటిని విడుదల చేసేందుకు వీలుగా తూములను నిర్మించాలని నిర్ణయించామని హరీశ్‌రావు తెలిపారు. కల్వకోట గ్రామానికి చెందిన వీరన్నకుంటతోపాటు గొలుసుకట్టు చెరువులను ఈ నీటితో నింపుతారు. కొండాపూర్ వద్ద పెద్దచెరువుతో పాటు గొలుసుకట్టు చెరువులను నింపుతారు. అంతర్గాం ఊరచెరువుతోపాటు గొలుసుకట్టు చెరువులను నింపేందుకు మరో తూము నిర్మిస్తారు.
మల్యాల మత్తడి చెరువుతో పాటు గొలుసుకట్టు చెరువులకు నీటిని అందించేందుకు ఇంకోటి నిర్మిస్తారు. తాటిపల్లి పెద్దచెరువుతో పాటు గొలుసుకట్టు చెరువులకోసం నింపేందుకు ఒకటి, బూరుగుపల్లి ఊరచెరువుతో పాటు గొలుసుకట్టు చెరువులను నీటితో నింపేందుకు
ఇంకో తూము నిర్మిస్తారు. నందగిరి బంజారికుంటతో పాటు గొలుసుకట్టు చెరువులకు, గట్టుబూత్కూరు ఊరచెరువు నింపేందుకు, నర్సింగాపూర్ చెరువు నింపేందుకు తూములను నిర్మిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే బాల్కొండతో పాటు మోర్తాడ్ మండలంలోని దోన్‌కల్, పాలెం, కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ల వద్ద తూములను ఏర్పాటు చేశారు. వరదకాలువ, ఎస్‌ఆర్‌ఎస్‌పి లింక్ ఎత్తిపోతల పథకానికి గత జూన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలిపారు. వరద కాలువ నుండి అరవై రోజుల పాటు రోజూ ఒక టీఎంసీ నీటిని మూడు దశల్లో తరలించేందుకు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు.
కడెం ప్రాజెక్టు ఎడమ కాలువపై క్రాస్ రెగ్యులేటర్
కడెంప్రాజెక్టు ఎడమ కాలువపై క్రాస్ రెగ్యులేటర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం 84.15 లక్షల రూపాయల వ్యయంతో కూడిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు విజ్ఞప్తిమేరకు క్రాస్ రెగ్యులేటర్‌కు నిధులు మంజరు చేశామని నీటిపారుదల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.