రాష్ట్రీయం

‘గన్నవరం’కు గుర్తింపు తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం: గన్నవరం ఎయిర్‌పోర్ట్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో మరింత ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ఇమ్మిగ్రేషన్ సిబ్బందిపై ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఇమ్మిగ్రేషన్ సిబ్బంది శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్రమంత్రి మాట్లాడుతూ డొమిస్టిక్‌ను ఒక ఏడాదిలో పూర్తిచేశామని, రన్‌వే విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. విదేశీయులు ఎవరు వచ్చినా ముందుగా ఇమ్మిగ్రేషన్ సిబ్బందినే కలుస్తారని, వారిపట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తే సానుకూల దృక్పథం పెరిగి ఎక్కువ మంది రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందన్నారు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందుబాటులోకి వస్తే విమాన సర్వీసులు పెరుగుతాయని, అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మంచిగా శిక్షణ పొంది ఎయిర్‌పోర్టుకు మంచి గుర్తింపు తేవాలని చెప్పారు. శిక్షణ పొందిన 20 మందిలో 10 మందిని ఈనెల 22 నుండి హైదరాబాద్‌లో జరిగే ప్రాక్టికల్ శిక్షణకు పంపుతున్నట్లు తెలిపారు. మిగిలిన 10 మందికి ఇక్కడే సాఫ్ట్‌స్కిల్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఇమ్మిగ్రేషన్ ఇన్‌ఛార్జి, సివిల్ అథార్టీ గజరావ్ భూపాల్ తెలిపారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు, అడిషినల్ సీపీ బివి రమణకుమార్ పాల్గొన్నారు.

చిత్రం..గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు