రాష్ట్రీయం

అవిశ్వాసం పెట్టండి.. అందర్నీ సమీకరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడితే తాను అందర్నీ సమీకరించడానికి సిద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన సవాల్‌కు పవన్ కళ్యాణ్ ప్రతిసవాల్ చేశారు. జగన్ నాకు ఛాలెంజ్ విసిరారు, నా సమాధానం ఇస్తా అంటూ పవన్ సోమవారం రాత్రి పాత్రికేయులతో మాట్లాడారు. అన్నింటికీ తాను సిద్ధపడే వచ్చానని, సవాలు స్వీకరిస్తానని అన్నారు. వైకాపా అవిశ్వాసం పెడితే మద్దతు ఇవ్వడానికి, మిగిలిన పార్టీలతో సంప్రదింపులకు తాను సిద్ధమని అన్నారు. ఒక్క ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చని, అందుకు వైకాపా ముందుకు రావాలని అన్నారు. మీరు ముందు అవిశ్వాసాన్ని పెట్టండి, కుదిరితే రేపే వైకాపా తమ ఎంపీలను లోక్‌సభ సెక్రటరీ జనరల్ వద్దకు పంపించాలని అన్నారు. సీపీఐ, సీపీఎం, బిజూ జనతాదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి అందరితో సంప్రదింపులు జరుపుతానని పేర్కొన్నారు. మీరూ, టీడీపీ కలిసి కమిట్ అయ్యారు. మీవి పాతిక, టీఆర్‌ఎస్ నేత కవిత, రాహుల్ కూడా మద్దతు ఇస్తా అన్నారు. అందరినీ కూడగడతా అని పవన్ చెప్పారు. అవిశ్వాసం ప్రవేశపెట్టగానే 10 రోజుల్లో డిబేట్ పెట్టాలని, స్పీకర్ అడుగుతారని పేర్కొన్నారు. వైకాపా అవిశ్వాసం పెడితే తెలుగుదేశం వ్యూహం ఏమిటో కూడా తేలిపోతుందని పవన్ చెప్పారు. తనకు ఎలాంటి క్రెడిట్ అక్కర్లేదని, క్రెడిట్ అంతా వైకాపా నేతలే తీసుకోవాలని పవన్ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీకి తాను మద్దతు మాత్రమే ఇచ్చానని, వైకాపా, టీడీపీ ఇద్దరూ అవిశ్వాసానికి భయపడుతున్నారనేది ప్రజల అనుమానమని, సందేహం కూడా వస్తోందని చెప్పారు. ఈసారి జరుగుతున్న బడ్జెట్ సమావేశం బలమైనదని, మళ్లీ ఇలాంటి అవకాశం రాదని, రేపే వెళ్తారా లేదా 4వ తేదీన వెళ్తారా అనేది వైకాపా ఇష్టమేనని అన్నారు. ఒక వేళ వైకాపా నేతలు అవిశ్వాసం పెట్టకున్నా టీడీపీకి కూడా అవకాశం ఉందని, వాళ్లు కూడా తీర్మానం పెట్టి మిగిలిన వారినుండి మద్దతు కూడగట్టవచ్చని చెప్పారు. తాను మాత్రం వెనక్కు వెళ్లేది లేదని, జగన్ దమ్ము, తెగింపు, ధైర్యం ఉన్న నాయకుడు కనుక అతనికి తాను అండగా ఉంటానని పేర్కొన్నారు.