రాష్ట్రీయం

టెక్నాలజీపై కొత్త చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: దేశంలో సాంకేతిక, విజ్ఞాన సమాచారాన్ని పరిరక్షించేందుకు కొద్దిరోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్టు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అన్ని సంస్థలూ, సంబంధీకులతో మాట్లాడేందుకు జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షతన కమిటీని నియమించినట్టు చెప్పారు. ఈ కమిటీ నివేదిక వచ్చే నెల వస్తుందని, వెంటనే దాన్ని చట్టం చేస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు ఐటీ రంగానికి సంబంధించి కొత్తగా పలు కమిటీలు వేశామని పేర్కొన్నారు. డిజిటల్ పరిజ్ఞానాన్ని దేశంలో సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం డిజిటల్ ఇండియా ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడారు. డిజిటల్ విప్లవంతో సాధారణ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే భ్రమలను కల్పించారని, వాస్తవానికి ఇపుడు ఐటీ రంగమే అతి పెద్ద ఉపాధి కల్పనరంగంగా ఎదిగిందన్నారు. డిజిటల్ విప్లవం పెరిగిన కొద్దీ ఉద్యోగాలు తగ్గిపోతాయనే భయం పోవాలని, పది ఉద్యోగాలు పోయినా, వంద ఉద్యోగాలు కొత్తగా కల్పించబడతాయన్నారు. నూతనంగా ఈ రంగంలో వస్తున్న సవాళ్లను ఎదర్కోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం చాలా కీలకం అవుతుందని వివరించారు. రానున్న రెండు మూడేళ్లలో డిజిటల్ లిటరసీ మిషన్ ద్వారా ఆరు కోట్ల మంది డిజిటల్ పరిజ్ఞానాన్ని వినియోగించేలా శిక్షణ ఇస్తామని, ఇప్పటికే కోటిమందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఈనాడు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ బీపీవోల ద్వారా డిజిటల్ సేవలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో డిజిటల్ విప్లవాన్ని వివరించారు. భారతదేశం అనేక రంగాల్లో తన ప్రత్యేకను ఇప్పటికే ప్రదర్శించిందని, ఐటీ ఎగుమతుల్లోనూ భారత్ ముందుందన్నారు. అన్ని రంగాల్లో ఈ-పరిష్కారాలను సూచిస్తున్నామని, ఐటీ సేవలతో ప్రజల అనుదిన కార్యక్రమాలు చాలా తేలికయ్యాయని వివరించారు. ఒకపుడు దేశంలో మొబైల్ తయారు చేసే సంస్థలు రెండుమాత్రమే ఉంటే నేడు ఆ సంఖ్య 118కి పెరిగిందన్నారు. అలాగే కృత్రిమ మేథస్సు దేశంలో పెరుగుతోందని, గణాంకాల ద్వారా మేథో సంపత్తిని వినియోగించుకుని పలు విశే్లషణలు చేయవచ్చని, రానున్న రోజుల్లో కృత్రిమ మేథస్సును సద్వినియోగం చేసుకోవల్సి ఉందన్నారు. రానున్న రోజుల్లో ఐటీ విప్లవంతో నైతిక విలువల సమస్యలు కూడా తలెత్తనున్నాయని హెచ్చరించారు.

చిత్రం..హైదరాబాద్‌లో సోమవారం మొదలైన ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో
సరికొత్త రోబోను ఆసక్తికి తిలకిస్తున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్