రాష్ట్రీయం

కొత్తగా ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఐటీ రంగంలో కొంతకాలంగా పనిచేసి, నూతన సాంకేతిక పరిజ్ఞాన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా వృత్తిలో రాణించేందుకు వీలుకల్పిస్తూ నాస్కామ్, భారత ఐటీ శాఖలు సంయుక్తంగా ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫారాన్ని ఏర్పాటు చేశాయి. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై నాస్కామ్ ప్రతినిధులు, భారత ఐటి శాఖ అధికారుల మధ్య సోమవారం ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో సంతకాలు జరిగాయి. నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కేంద్ర ఐటీ కార్యదర్శి అజయ్ సహాని సంతకాలు చేశారు. దేశంలో నాలుగు మిలియన్ల ఐటీ ఉద్యోగులున్నారని, వారిలో కనీసం రెండు మిలియన్ల ఉద్యోగులకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని, అత్యంత గిరాకీ ఉన్న రంగాల్లో అడ్వాన్స్ శిక్షణ ఫ్యూచర్ స్కిల్స్ ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రోబోటిక్స్ ప్రాసెస్ అటోమేషన్, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, సోషల్ అండ్ మొబైల్, బిగ్ డాటా అనలైటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, 3డి ప్రింటింగ్ రంగాలు చాలా కీలకం కానున్నాయని, ఈ రంగాల్లో ఒక దాన్ని ఎంచుకున్న తర్వాత దానిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అనంతరం వారి సాంకేతిక సామర్ధ్యాలను అంచనా వేస్తామని, తదనుగుణంగా వారికి సర్ట్ఫికేట్లు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ తరహా శిక్షణకు పూర్తిగా తోడ్పడుతుందని చెప్పారు. ఈ శిక్షణ విధానం, ఎంపిక, కేంద్ర ప్రభుత్వం ఏ తరహా సహకారం అందించాలనే అంశాలపై త్వరలో మరింత లోతైన అధ్యయనం జరుగుతుందని తెలిపారు.

చిత్రం..ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫారం ఒప్పందాలను కేంద్ర మంత్రి సమక్షంలో మార్చుకుంటున్న కేంద్ర ఐటీ, నాస్కాం ప్రతినిధులు