రాష్ట్రీయం

రైల్వే జోన్‌కు మళ్లీ మెలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: కొత్తగా ఏర్పడిన ఏపీకి రైల్వే జోన్ ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఒడిశా రాష్ట్రానికి చెందిన తూర్పుకోస్తా రైల్వేలో భాగమైన వాల్తేరు డివిజన్ విభజన మా ఆమోదం లేకుండా ఎలా సాధ్యం. ఒడిశాలో మూడు కొత్త రైల్వే డివిజన్లు కావాలని మూడేళ్లుగా కోరుతున్నాం. రైల్వే పరంగా మా అభ్యర్థనలు మన్నించిన మీదటే ఏపీకి జోన్ ప్రకటించుకోవాలంటూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆగ్నేయ రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను 2003లో విడదీసి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటు చేశారు. ఒడిశాలోని ఖుర్దారోడ్‌తో పాటు ఏపీలోని వాల్తేరు, ఇంకో రాష్ట్రంలోని సంబల్‌పూర్ డివిజన్‌లతో కలిపి కొత్త జోన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వేకి వాల్తేరు డివిజన్ ప్రధాన ఆదాయ వనరు. ఈ తరుణంలో వాల్తేరు డివిజన్‌ను ఏపీకి కేటాయిస్తే, తూర్పుకోస్తా జోన్ నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్‌లో భాగంగా ఉన్న జగదల్‌పూర్, కిరండూల్, కోరాపుట్, నవరంగ్‌పూర్ ప్రాంతాలను విడదీసి తాము మూడేళ్లుగా అడుగుతున్న రూర్కెలా, జైపూర్, రాయగడ డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్నది ఒడిశా వాదన.
ఈసారి బడ్జెట్‌లో కేంద్రం నుంచి రైల్వే పరంగా తాము రూ.3,160 కోట్ల రూపాయల నిధులు కోరితే, కేవలం రూ.1,420 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించడాన్ని ఒడిశా ప్రభుత్వం ప్రస్తావించింది. ఇదిలాఉండగా ఇప్పటికే ఒక ప్రతిపాదన రైల్వే మంత్రిత్వ శాఖ ముందుంచినట్టు సమాచారం. వాల్తేరు డివిజన్‌లో భాగంగా ఉన్న ఒడిశా ప్రాంతాన్ని మినహాయించి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనికి స్పందనగానే ఒడిశా నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఈ అంశాన్ని మరింత జఠిలం చేయడం ద్వారా ఇప్పట్లో పరిష్కారానికి అవకాశం లేకుండా చూసే ధోరణిలో కేంద్రం వెళ్తున్నట్టు రాష్ట్ర రాజకీయ పార్టీల అనుమానం. ఒడిశా ప్రభుత్వం కోరుతున్నట్టు ఒడిశాలో కొత్తగా మూడు డివిజన్లు ఏర్పాటు చేయాలంటే తూర్పుకోస్తాతో పాటు ఆగ్నేయ రైల్వే, ఆగ్నేయ మధ్య రైల్వేలను పునర్విభజించాలి. అంటే మూడు జోన్లను అస్థిర పరచడంకంటే యథాతథ స్థితిని కొనసాగించడమే మంచిదన్న ఉద్దేశంతో కేంద్రం రైల్వేజోన్ అంశాన్ని సాగదీస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశాలో కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యం కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారును రైల్వేజోన్ ప్రకటనపై మీమాంసలో పడేట్టు చేసిందన్న ప్రచారం సాగుతోంది.