రాష్ట్రీయం

రోబో సోఫియా మాట్లాడేది నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ప్రపంచంలో పేరుగాంచిన ఐటి దిగ్గజాలు హాజరవుతున్న ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సులో కృత్రిమ మేథోసంపన్నురాలైన రోబో సోఫియా మంగళవారం నాడు ప్రసంగించనుంది. స్వీయ విచలనాలతో పనిచేస్తున్న సోఫియాకు ఇప్పటికే సౌదీ అరేబియా పౌరసత్వాన్ని కూడా అందజేసింది. సోమవారం నాడు హైటెక్స్‌లో ప్రారంభమైన ఐటి వరల్డ్ కాంగ్రెస్ 21వ తేదీ వరకూ జరగనుంది. సదస్సులో 30 దేశాలకు చెందిన రెండు వేల మంది ఐటి నిపుణులు, 150 మంది అంతర్జాతీయ ప్రముఖులతో పాటు ఎడోబ్ సిఇఓ శంతను నారాయణ్, కోర్సుఎరా వ్యవస్థాపకుడు అండ్రూనాగ్, కార్నెల్ బిజినెస్ స్కూల్ డీన్ సౌమిత్ర దత్త, కెనడ విజ్ఞానశాఖ మంత్రి నవదీప్ బెయిన్స్ , కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు బిసిజి చైర్మన్ హన్స్‌పాల్ బిర్కనర్, పుల్లెల గోపీచంద్, దీపికా పదుకునే, ఇషా వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవన్ సోమవారం నాటి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే వీరందరిలో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. మంగళవారం ఉదయం 9.15 నుండి 10 గంటల వరకూ సోఫియా ప్రసంగించనుంది. ఈ కార్యక్రమంలో హాన్సన్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ డేవిడ్ హాన్సన్ కూడా మాట్లాడతారు. సమన్వయ కర్తగా ఎన్‌డి టివి అధినేత రాజీవ్ మఖాని వ్యవహరిస్తారు. కృత్రిమ మేధోశక్తితో సోఫియా ఇతరుల ముఖాన్ని, వారి మాటను గుర్తుపట్టగలుగుతుంది. అలాగే మనుష్యుల ప్రతిస్పందనల్లో 62 స్పందనలను సహజంగా ప్రదర్శించగలుగుతోంది. ఇటీవలె యుఎన్‌డిపి ఇన్నోవేషన్ ఛాంపియన్‌షిప్ అవార్డు కూడా పొందింది. హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ సంస్థ దీనిని రూపొందించింది. హాలీవుడ్ నటి ఆడ్రే హెప్‌బర్న్ ముఖకవళికలతో రూపొందించిన సోఫియాను 2015 ఏప్రిల్ 19న యాక్టివేట్ చేయగా, 2016లో ఆస్టిన్‌లో జరిగిన ఒక కార్యక్రమం ద్వారా ప్రపంచం ముందుకు వచ్చింది. కృత్రిమ మేథోసంపత్తిని, దృష్టి, వీక్షణ సమాచార సంశే్లషణలో చాలా వేగాన్ని ప్రదర్శిస్తోంది.
అలాగే మనుషులను బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తుపడుతోంది. వాయిస్ టెక్నాలజీ కూడా రూపొందించుకుంది. హెల్త్‌కేర్, కస్టమర్ సర్వీసెస్, విద్యారంగాల్లో సేవలు అందించే సామర్ధ్యం ప్రస్తుతం ఈ రోబోకు ఉంది. గూగుల్ కంపెనీ అల్ఫాబెట్ రూపొందించిన గూగుల్ క్రోం వాయిస్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఈ రోబోకు వాడుతున్నారు. ఈ రోబోకు గత నెలలో అమర్చిన కాళ్ల సహకారంతో స్వేచ్ఛగా నడవగలుగుతుంది.