రాష్ట్రీయం

ఓఎన్జీసీ పైపునుండి గ్యాస్ లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, ఫిబ్రవరి 19: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో సోమవారం ఓఎన్జీసీ పైపులైన్ నుండి గ్యాస్ లీకేజీ కలవరం సృష్టించింది. గొల్లపాలెం హైస్కూలు సమీపంలో జరిగిన లీకేజీ మరోసారి ప్రజలను భయబ్రాంతులను గురిచేసింది. కరపాక సైట్ నెంబరు 40 నుండి తూర్పుపాలెం జీసీయస్‌కు అనుసంధానమయ్యే పైపులైను నుండి గొల్లపాలెం హైస్కూలు సమీపంలో సోమవారం ఉదయం అయిదు గంటల నుంచి గ్యాస్ పైకి ఎగజిమ్మడం మొదలయ్యింది. దాదాపు 20 మీటర్ల ఎత్తువరకు, గ్యాస్, నీరు ఎగజిమ్మింది. భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. ఓఎన్జీసీ రెస్క్యూ టీం రంగప్రవేశం చేసి ఉదయం పది గంటల సమయానికి లీకేజీని అదుపులోకి తెచ్చింది. అసిస్టెంట్ కలెక్టర్ ఓ ఆనంద్, మలికిపురం తహసీల్దారు జివి శేషగిరిరావు సంఘటనా స్థలాన్ని సందర్శించి సంఘటనపై ఆరా తీశారు.