ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి బకాయిలకు స్ర్తినిధి సర్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 22: ఉపాధి నిధులు రావడంలో ఆలస్యమైన సందర్భంలో రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీలకు వేతనంగా స్ర్తినిధి నిధులు సర్దుబాటు చేసేవిధంగా ఆలోచన చేస్తున్నామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి రామాంజనేయులు తెలిపారు. రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 84లక్షల మందికి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు జారీచేశామని, అందులో సుమారు 60 లక్షల మంది వరకు పనులు చేస్తుంటారన్నారు. వీరికి సంబంధించి 2014-15లో రూ.2800 కోట్లు, 2015-16లో రూ.4 000 కోట్లు, 2016-17లో రూ.4500 కోట్లు, 2017-18లో రూ.6000 కోట్లకు పైబడి నిధులు వచ్చాయన్నారు. అయితే గత 45 రోజులుగా ఉపాధి నిధులు రూ.197 కోట్లు బకాయిలున్నాయని, మరో రెండు మూడు రోజుల్లో రూ.169 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం రోజువారీ ఇంటికి అవసరమైన సరుకులు కొనుక్కోవాలంటే ఉపాధి కూలీయే ఆధారమన్నారు.