రాష్ట్రీయం

ఎంవోయూలపై ఆచితూచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 22: రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో లోపం కనిపిస్తోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు తపన పడుతు న్నా, ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు భాగస్వామ్య సదస్సులు జరిగాయి. రెండు సదస్సులకు సుమారు 50 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అంబానీ, టాటాలు సైతం సదస్సుకు హాజరై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారు. అయతే, గడచిన రెండు సదస్సులలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఎన్ని సాకారమయ్యాయన్నది ఇదమిద్దంగా చెప్పలేకపోకపోతున్నారు. దీనివలన ప్రభుత్వం విమర్శలకు గురవుతోంది. 2016లో జరిగిన భాగస్వామ్య సదస్సులో 3.4 లక్షల కోట్ల పెట్టుబడు లు వచ్చాయని, 2017లో దాదాపూ ఏడు లక్షల కోట్ల రూపాయల వరకూ
పెట్టుబడులు వచ్చాయని, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. అనుకున్న స్థాయిలో పెట్టుబడులు రాకపోవడంతో ప్రభుత్వం విమర్శలకు గురవుతోం ది. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించినట్టుం ది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి వేల కోట్లలో కూడా పెట్టుడులు రాలేదన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రభుత్వం శనివారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో నిఖార్సయిన కంపెనీలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ ఏడాది సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అలాగే, 400 ఎంఓయూలపై మాత్రమే సంతకాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా, ప్రభుత్వం మాత్రం ఈ భాగస్వామ్య సదస్సుల వలన రాష్ట్రానికి 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 22 లక్షల మందికి ఉపాధి లభించిందని చెపుతోంది. ఈ విషయమై మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2016లో జరిగిన ఎంఓయూలలో జీ1 కేటగిరిలో 42.85 శాతం ఎంఓయూలు, 35.16 శాతం పెట్టుబడులు, 11.13 శాతం ఉద్యోగాలు వచ్చాయని ప్రకటించారు. జీ-2 కేటగిరిలో 10 శాతం ఎంఓయులు, 1.03 శాతం పెట్టుబడులు, 1.39 శాతం ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఇదిలావుండగా ప్రస్తుతం భాగస్వామ్య సదస్సు జరుగుతున్న ప్రదేశంలో నిర్మించతలపెట్టిన కనె్వన్షన్ సెంటర్‌కు సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం భూమి పూజ చేయనున్నారని మంత్రి గంటా చెప్పారు. 26న జీవీఎంసీలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు.

చిత్రం..