రాష్ట్రీయం

తొమ్మిదన్నారు.. ఏడు వేలిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 22: గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఖమ్మం మిర్చి మార్కెట్ వ్యవహారం ఈ ఏడాది తొలిదశలోనే రైతుల ఆందోళనలకు వేదికైంది. గిట్టుబాటు ధరకోసం రైతులు గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ముట్టడించి, అధికార్లను ఘెరావ్ చేశారు. సముదాయించేందుకు వచ్చిన అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కార్యదర్శి ఆర్ సంతోష్‌కుమార్‌తో పాటు పోలీస్ అధికారులను ఘెరావ్ చేసి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పుతున్నా పోలీసులు సంయమనంతో రైతులను బుజ్జగిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మార్కెట్ ప్రారంభం కాగానే మిర్చి జెండాపాట క్వింటాకు 9,702 రూపాయలుగా నమోదైంది. కొద్దిసేపటికే అదే రైతుల వద్దకు వచ్చిన వ్యాపారులు 9వేలకే కొనుగోలు చేస్తామని చెప్పటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మిగిలిన రైతుల పంటను 7వేల రూపాయలలోపే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సన్నద్ధమవటంతో రైతుల ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. బస్తాలు చింపి ధర నిర్ణయించిన తరువాత తిరిగి వచ్చి అంత ధర ఇవ్వలేమని చెప్పటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రైతులంతా ఏకంకావటంతో గందరగోళంగా మారింది. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న అధికారులను రైతులు నిలదీయటంతో వ్యాపారులు అక్కడ నుండి జారుకున్నారు. రైతుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం పార్టీల నేతలు మార్కెట్‌కు చేరుకొని రైతులకు మద్దతుగా నినదించారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని అధికారులకు, రైతులకు మధ్య సమావేశం జరిపించారు. సమావేశంలో 9వేలకు రైతుల వద్ద కొనుగోలు చేసిన మిర్చికి అదే ధర ఇవ్వాలని, 8,900 దిగువకు కొనుగోలు చేసిన మిర్చికి మరో 200 రూపాయలు కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ చేసేదిలేక ఆవేదనతో తమ పంటను వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇప్పుడు అమ్మమంటే తమ పంటను ఎవరు కొనుగోలు చేయరని, వ్యాపారుల్లో ఉన్న ఐక్యత అలాంటిదని రైతులు చెప్పటం గమనార్హం.

చిత్రం..ఖమ్మం మార్కెట్ కార్యదర్శిని, పోలీసు అధికారులను ఘెరావ్ చేస్తున్న రైతులు