రాష్ట్రీయం

టెక్నాలజీలో మేమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: సాంకేతిక పరిజ్ఞానంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖలో జరుగుతున్న రెండో రోజైన ఆదివారం ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అన్న అంశంపై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రియల్‌టైం గవర్నెస్, ఈ ఫైలింగ్, క్లౌడ్ మేనేజ్‌మెంట్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు వివరించారు. తను సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. అత్యాధునిక సాంకేతికతతోనే 80 శాతం సంతృప్తిని సాధించగలుగుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధార్, ప్రజాసాధికారిక సర్వేలో రాష్ట్ర ప్రజల వివరాలు సేకరించి, వారికి కావల్సిన సౌకర్యాలను అందిస్తున్నామని అన్నారు.
ఆధార్ మాదిరి భూదార్ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని, దీంతో రాష్ట్రంలో ప్రతి ఇంచ్ భూమి వివరాలు సేకరించామని, భూ యజమానులకు టైటిల్ డీడ్స్ అందించామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ-ఆఫీస్, ఈ-క్యాబిన్ వంటివి ఇప్పటికే అమలు జరుగుతున్నాయని, మార్చి చివరినాటికి పేపర్‌లెస్ ఆఫీస్‌కి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఏపీని క్లౌడ్ మేనేజ్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న గనుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నామనిఅన్నారు. రియల్‌టైం గవర్నెన్స్‌తో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వనరులను, అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. మాదిరి రాష్ట్రంలో ప్రతి శాఖకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచామని అన్నారు. అలెక్సా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫైబర్‌నెట్‌ను ఉపయోగించి ఎవ్వరైనా ఎప్పుడైనా సమాచారాన్ని తెలుసుకోవచ్చని, అలాగే ఎప్పటికప్పుడు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని చంద్రబాబు చెప్పారు. దేశంలోని మరే రాష్ట్రంలోను ఇటువంటి సౌకర్యం లేదని ఆయన పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లో ఏపీని సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు.

చిత్రం..రియల్‌టైం గవర్నెన్స్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సీఎం చంద్రబాబు