రాష్ట్రీయం

ఆశలు నింపుతున్న శ్రీశైలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 25 : రాష్ట్ర విభజన తరువాత తొలిసారి శ్రీశైలం జలాశయంలో ఫిబ్రవరి చివరలోనూ మోస్తరు నీటి నిల్వ ఉంచి ప్రజలకు ఆందోళన లేకుండా చేశారు. విభజన తరువాత గత నాలుగేళ్లు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇష్టానుసారం శ్రీశైలం జలాశయంలోని నీటిని వినియోగించుకోవడంతో ఫిబ్రవరి మొదటి వారానికే జలాశయం ఖాళీ అయి సీమ ప్రజలను భయపెట్టేది. ఈ పరిణామాల్లోనే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చొరవతో ఇరు రాష్ట్రాలు వినియోగించే నీటిని లెక్కించేందుకు టెలీ మీటర్లు ఏర్పాటయ్యాయ. దాంతో ఎవరి పరిధిలో వారు నీటిని వినియోగించుకోవడంతో శ్రీశైలం జలాశయంలో మోస్తరు నీటిని చూడగలుగుతున్నామని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన 2014 ఫిబ్రవరిలో శ్రీశైలం జలాశయంలో 871 అడుగుల నీటిమట్టం, 148 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తరువాత 2014 మార్చిలో విభజన జరగడంతో అదే ఏడాది మేలో ఇరు రాష్ట్రాల శాసన సభలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించారు. దాంతో 2014 ఆగస్టు నుంచి రెండు రాష్ట్రాలు నీటిని ఇష్టానుసారంగా దిగువన నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లడంతో 2015 ఫిబ్రవరి 20నాటికి జలాశయ నీటి మట్టం 834.5 అడుగుల దిగువకు చేరుకుని నీటి నిల్వ 54.44 టీఎంసీలకు పడిపోయింది. ఇక 2016 ఫిబ్రవరిలో
మరీ దారుణంగా నీటిమట్టం 821.8 అడుగులకు చేరుకుని నీటి నిల్వ కనీస స్థాయికంటే దిగువకు చేరుకుని 42.14 టీఎంసీలుగా నమోదైంది. ఇక 2017 జనవరిలో కృష్ణా బోర్డు సూచనలతో ఇరు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని తగ్గించుకోవడంతో 835.6 అడుగుల నీటి మట్టం, 56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఇరు రాష్ట్రాలు కేఆర్‌ఎంబీకి పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో విచారణ జరిపిన బోర్డు రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వద్ద నీటి వినియోగ యంత్రాలను ఏర్పాటు చేస్తామని, ఎవరి వాటాను వారు మాత్రమే వాడుకోవాలని, అంతకుమించి అవసరమైతే బోర్డు అనుమతి తీసుకోవాలని సూచించింది. టెలీ మెట్రీల ఏర్పాటు కారణంగా నీటి వినియోగం తగ్గడంతో ఈ ఏడాది 79 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నీటిని మార్చి చివర, ఏప్రిల్ రెండవ వారం వరకూ వినియోగించుకోగలుగుతామని తద్వారా అనేక గ్రామాలు, పలు పట్టణాల్లో తాగునీటి కొరత లేకుండా చూడవచ్చని వారంటున్నారు. కాగా రెండు రాష్ట్రాల్లోనూ జల విద్యుదుత్పత్తి తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుదుత్పతి చేస్తున్నారని, తద్వారా భవిష్యత్తులో మరింత నీరు నిల్వ చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. కాగా రాష్ట్ర విభజనకు ముందు 2009లో 862 అడుగుల నీటిమట్టం, 157 టీఎంసీల నీటి నిల్వ, 2010లో 863.5 అడుగుల నీటి మట్టం, 170 టీఎంసీల నీటి నిల్వ, 2011లో 869 అడుగుల నీటి మట్టం, 182.54 టీఎంసీల నీటి నిల్వ, 2012లో 835.2 అడుగుల నీటి మట్టం, 88 టీఎంసీల నీటి నిల్వ, 2013లో 857 అడుగుల నీటి మట్టం, 97 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు శ్రీశైలం జలాశయ అధికారులు పేర్కొంటున్నారు. విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలను దృష్టిలో పెట్టుకుని నీటిని వినియోగించేదని వారు పేర్కొన్నారు. విభజన తరువాత తెలంగాణ నాగార్జునసాగర్‌లో నీటిని నిల్వ ఉంచడం కోసం పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేసి శ్రీశైలం నుంచి నీటిని తరలించుకుపోయేదని అధికారులు వెల్లడిస్తున్నారు. భవిష్యత్తులో శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోవాలంటే ఫిబ్రవరి నెలాఖరు వరకూ 860 అడుగుల నీటిమట్టం ఉంటే సాధ్యమవుతుందని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. లేదంటే తాగునీటికీ ఇబ్బందులు తప్పవన్నది వారి హెచ్చరిక.