ఆంధ్రప్రదేశ్‌

నేడు సప్తవాహనాలపై విహరించనున్న శ్రీవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సూర్యజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రథసప్తమి వేడుకలను నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనేపథ్యంలో ఆదివారం తిరుమల్లో నిర్వహించే ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. ఈరథసప్తమి వేడుకలను భక్తుల మినీ బ్రహ్మోత్సవమని భావిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారు రోజుకు రెండు వాహనాలను అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఈ ఉత్సవాల్లో ఒకే రోజు ఏడు వాహనాలపై విహరిస్తారు. ఈసందర్భంగా స్వామివారిని చూసి తరించాలని భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. ఈనేపథ్యంలో ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి సూర్యనారాయణ మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం వరుసగా చిన్నశేష, గరుడ,హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వంటి వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2గంటల మధ్య హనుమంత వాహనం పూర్తయిన తరువాత 2 నుంచి 3గంటల మధ్య స్వామివారి చక్రత్తాళ్వార్‌కి శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. అటు తరువాత 4 నుంచి 9గంటల నడుమ కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తారు. కాగా ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని చంటిపిల్లల తల్లితండ్రులకు, వయోవృద్దులకు, వికలాంగులకు, దాతలు, మిలటరీ, ఎన్ ఆర్ ఐ లకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను కూడా టిటిడి రద్దు చేసింది.ప్రతి ఏడాది మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడి జయంతినే రథసప్తమి వేడుకలుగా టిటిడి నిర్వహిస్తోంది.

ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి ఉత్తర మాడవీధిలోని వరాహస్వామి ఆలయం వద్దకు వేంచేపుచేస్తారు. భానుడు ఉదయించి ఆయన కిరణాలు సూర్యప్రభ వాహనంపై ఉన్న మలయప్ప స్వామి పాదాల నుంచి ఆపాదమస్తకం ప్రసరిస్తున్న సమయంలో అర్చకులు కర్పూర హారతులు పడతారు. అక్కడ నుంచి స్వామివారు ఊరేగింపుగా వాహన మండపం చేరుకుంటారు. అక్కడ నుంచి వాహనాల ఊరేగింపు పరంపర కొనసాగుతుంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి 150మంది హోంగార్డులు, 2500మంది శ్రీవారి సేవకులు 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకోనుంది.

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు
మావోయిస్టులు మృతి
భద్రాచలం, ఫిబ్రవరి 13: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. బీజాపూర్ జిల్లా ఫర్సేగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సేండ్ర అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనాస్థలం మహారాష్టక్రు సరిహద్దున ఉంది. అయితే ఎదురుకాల్పులు ఇంకా జరుగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. 5 తుపాకులు, ఒక రైఫిల్, బర్మార్ తుపాకులు 4 సంఘటన స్థలం నుంచి బీజాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. అరన్‌పూర్-జేగురుగొండ రోడ్డు నిర్మాణానికి సెక్యూరిటీకి వెళ్లిన జవాన్లు మందుపాతర పేలుడులో గాయపడ్డారు. వీరిని దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ప్రథమ చికిత్స అందించి తర్వాత హెలీకాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు.
విద్యార్థినిపై యాసిడ్ దాడి
త్రుటిలో తప్పిన ప్రమాదం
హిందూపురం, ఫిబ్రవరి 13: అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ యువతిపై శనివారం యాసిడ్ దాడి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని హస్నాబాద్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఇమాంసాబ్ కుమార్తె గౌసియా (18) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. శనివారం ఇంటి సమీపంలోని ఓ దుకాణంలో బిస్కె ట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లగా అదే సమయంలో సైకిల్ వచ్చిన ఓ యువకుడు హఠాత్తుగా ఆమెపై యాసిడ్ బాటిల్ విసిరాడు. అయితే గౌసియా ముఖం పక్కకు తిప్పడంతో భుజంపై యాసిడ్ పడింది. దీంతో ఆమె దుస్తులు కాలి గాయాలయ్యాయి. గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రాణాపాయం ఏమీ లేదని తెలిపారు. గౌసియా ముఖం తిప్పకపోయి ఉంటే యాసిడ్ పడి కాలిపోయేది. యాసిడ్ దాడికి పాల్పడిన యువకుడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అగ్రిగోల్డ్ ఖాతాదారుల
ఒత్తిడికి ఏజెంట్ బలి

ఒంగోలు, ఫిబ్రవరి 13: అగ్రిగోల్డ్ ఖాతాదారులు నగదు చెల్లించాలని గత వారం రోజుల నుండి ఒత్తిడి చేయటంతో ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండల కేంద్రానికి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ ఏలూరి హనుమంతాచారి (48) మృత్యువాతపడ్డారు. హనుమంతాచారిని గత వారంరోజులనుండి ఖాతాదారులు నగదు చెల్లించాలని ఒత్తిడి చేయటంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక మానసిక ఆందోళన చెందటంతో తలలో నరాలు చిట్లి కోమాలోకి వెళ్లారు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం వైద్యశాలలో చేర్చించగా శనివారం ఆయన మృతిచెందాడు. అగ్రిగోల్డ్‌బాధితులెవ్వరు ఆందోళన చెందవద్దని ఆస్తులన్ని స్వాధీనం చేసుకున్నామని, త్వరలోనే బాధితులందరికి నగదు చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి సంవత్సరం కావాస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరికి పైసా చెల్లించలేదు. పైగా కేసు హైకోర్టులో ఉండడం, ఇటీవల సంస్థ చైర్మన్‌ను అరెస్టుచేయడం వంటి ఘటనలతో తిరిగి ఖాతాదారులు ఏజెంట్లపై ఒత్తిడి ప్రారంభించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక నరాలు చిట్లి కోమాలోకి వెళ్ళి హనుమంతాచారి శనివారం మృత్యువాతపడ్డారు. ఆయనకు భార్య,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.