ఆంధ్రప్రదేశ్‌

గోదావరి కాల్వగట్లపై సౌర విద్యుత్ ప్యానెళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం:కాలువ గట్లపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటుచేయటం ద్వారా జూన్ నాటికి పశ్చిమగోదావరి జిల్లా లోని రెండు ప్రాంతాల నుండి ఆరు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిచేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాలువ గట్లపై ఇలా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తొలిసారి. కాలువ గట్లపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటుచేసి సౌర విద్యుత్‌ను ఉత్పత్తిచేసేందుకు పోలవరం కుడి కాలువ గట్టు అనువుగా ఉంటుందని గుర్తించిన ఎపి జెన్‌కో తొలి సౌర విద్యుత్ ప్రాజెక్టును పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం వద్ద నిర్మాణాన్ని చేపట్టింది. 100 మీటర్లు వెడల్పున పోలవరం కుడి కాలువ గట్టును వినియోగించుకుంటూ 1.2కిలోమీటర్లు పొడవున 100మీటర్లు వెడల్పుతో సుమారు 28ఎకరాల్లో ఎపి జెన్‌కో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు నుండి ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా సాగుతుండటంతో జూన్ నాటికి ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఎపి జెన్‌కో ఉంది. సౌర శక్తిని వినియోగించుకున్న దాంట్లో కేవలం 17శాతం నుండి 19శాతం మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తవుతుంది. రానున్న రోజుల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కనుక 30 శాతం నుండి 50 శాతానికి పెరిగితే సౌర విద్యుత్ ధర బాగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అనంతపురంలో ఏర్పాటుచేయనున్న సౌర విద్యుత్ పార్కులో సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటుచేసి సౌర విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తే, యూనిట్ విద్యుత్ ధర రూ.6.66 ఉంటుందని భావిస్తే, టెండర్లలో పోటీపడ్డ సంస్థలు యూనిట్ రూ.4.63కు సరఫరాచేసేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫాక్టర్ 70శాతం నుండి 80శాతం ఉంటుందని, సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇది 17శాతం నుండి 19శాతం అయినప్పటికీ యూనిట్ ధరను రూ.4.63గా సౌర విద్యుత్ ఉత్పత్తిచేసేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయంటే సౌర విద్యుత్‌ను అభివృద్ధి చేయటం వల్ల భవిష్యత్తులో ఎంత ప్రయోజనం ఉంటుందో అర్ధంచేసుకోవచ్చని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. సౌర విద్యుత్ ప్యానళ్ల తయారీ దేశీయంగా వృద్ధి చెందటం, సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందటం వంటి పరిణామాలతో భవిష్యత్తులో సౌర విద్యుత్ మరింత చవుకగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం కుడి కాలువ గట్టుపై ఐదు మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఎపి జెన్‌కో ఉత్పత్తి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తోడు, పశ్చిమగోదావరి జిల్లాలోనే భీమవరం వద్ద లోసరి మెయిన్ చానల్‌పై 1.1కిలోమీటరు పొడవున, 10మీటర్లు వెడల్పున నెడ్‌కాప్ ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోంది. ఇది మార్చి నెలాఖరు నాటికి సౌర విద్యుత్‌ను అందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
పశ్చిమగోదావరికి ఏ మాత్రం తీసిపోని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఇలాంటి ప్రయత్నం ఇంత వరకు జరగలేదు. ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటుచేసుకుని, మీటర్లు విధానాన్ని అమలుచేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రయోగాత్మకమైన సౌర విద్యుత్ ఉత్పత్తికి రాజమహేంద్రవరాన్ని వేదికగా చేసుకోవాలని నిపుణులు నిపుణులు సూచిస్తున్నారు.