ఆంధ్రప్రదేశ్‌

ఇసుక రీచ్‌ల వేలంలో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: మేధావులతో చర్చలు..నెలల తరబడి అధ్యయనాలు..మంత్రి ఉపసంఘం చర్చల ఫలితాలతో రూపొందించిన కొత్త ఇసుక విధానం బెడిసికొట్టేలా కనిపిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అస్తవ్యస్తంగా తయారయిన ఇసుక విధానాన్ని రద్దుచేసి, మహిళా పొదుపు సంఘాలను తెరపైకి తెచ్చి వినియోగదారులను ఇబ్బందులు పెట్టిన రాష్ట్రప్రభుత్వం ఇపుడు మరోసారి కొత్త ఇసుక విధానాన్ని అమలుచేసే ప్రయత్నంలో వినియోగదారులకు మరిన్ని ఇసుక కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. ఇసుక రీచ్‌ల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండే తూర్పుగోదావరి జిల్లాలో శనివారం ఏడు రీచ్‌లకు జరిగిన ఇ వేలం విధానం జరిగిన తీరు చూస్తే అసలు కొత్త విధానాన్ని అమలుచేయటం సాధ్యమేనా అనిపిస్తోందని ఇసుక వ్యవహారాల్లో అనుభవం ఉన్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. వినియోగదారుడికి క్యూబిక్ మీటరు ఇసుకను రూ.500కు మించి అమ్మకూడదన్న కచ్చితమైన నిబంధనను రాష్ట్రప్రభుత్వం విధిస్తే, తూర్పుగోదావరి జిల్లాలోని జొన్నాడ ఇసుక రీచ్‌ను దక్కించుకునేందుకు రాష్ట్రప్రభుత్వానికి క్యూబిక్ మీటరుకు రూ.1574చెల్లించేందుకు ఒక దరఖాస్తుదారుడు కోట్ చేసినట్టు తెలుస్తోంది. క్యూబిక్ మీటరు ఇసుకను రూ.500 అమ్మాల్సిన లీజుదారుడు, క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.1574చెల్లించి ఎలా వ్యాపారం చేస్తాడో రాష్ట్రప్రభుత్వానికే తెలియాలి. మందపల్లి రీచ్ నుండి క్యూబిక్ మీటరుకు రూ.1020, వేమగిరి-కడియపులంక రీచ్ నుండి రూ.884, ఆత్రేయపురం రీచ్ నుండి క్యూబిక్ మీటరుకు రూ.700 చెల్లించేందుకు ఇ వేలంలో దరఖాస్తుదారులు వేలం ధరను కోట్ చేసారంటే కొత్త ఇసుక విధానంలోని లోపాలు ఎలా ఉన్నాయో, రీచ్‌లు దక్కించుకునేందుకు దరఖాస్తుదారులు ఎంతగా కాలు దువ్వుతున్నారో స్పష్టంగా అర్ధమవుతోంది. అంకంపాలెం, ఊబలంక రీచ్‌ల విషయంలో మాత్రం తక్కువ మొత్తాలకే కోట్ చేసినట్టు తెలుస్తోంది. క్యూబిక్ మీటరు ఇసుక రూ.500కు మించి అమ్మకూడదన్న నిబంధన పెట్టిన రాష్ట్రప్రభుత్వం, గరిష్ఠంగా ఎంత వరకు వేలం ధరను కోట్ చేయాలో కొత్త ఇసుక విధానంలో పేర్కొనలేదు. దాంతో ఎవరిష్టమొచ్చినట్టు వారు వేలం ధరను కోట్ చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం చూస్తే అక్రమ తవ్వకాలు పెరగటం లేదా వినియోగదారులకు అధిక ధరలకు అమ్మటం ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరుతుందని ఇసుక వ్యాపారంలో అనుభవం ఉన్న వారు చెబుతున్నారు. గతంలో ఇలాగే అడ్డూ అదుపూ లేకుండా అధిక వేలం ధరలకు రీచ్‌లను దక్కించుకున్న లీజుదారులు, తరువాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తమకు నచ్చిన ధరకు ఇసుకను అమ్ముకునే మార్గాన్ని సుగమం చేసుకున్నారు. ఈ విధానాన్ని చూస్తుంటే మళ్లీ అలాంటి పరిస్థితులే పునరావృతమయ్యేలా ఉన్నాయని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

బాబుది మోసపూరిత పాలన

అసెంబ్లీలో వంశధార నిర్వాసితుల సమస్యలు ప్రస్తావిస్తా: వైకాపా అధినేత జగన్

ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసపూరిత పాలన చేస్తూ, అన్ని వర్గాల వారిని వీధిన పడేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రణస్థలం మండలంలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం హిరమండలంలో వంశధార నిర్వాసితుల దీక్షా శిబిరానికి చేరుకుని అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాతలలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట రమణ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. తర్వాత అరసవల్లి ఆదిత్యుని దర్శనం చేసుకోవల్సిన జగన్ తన నిర్ణయాన్ని మార్పుచేసుకుని విశాఖపట్నం తిరిగి పయనమయ్యారు. ఈ సందర్భంగా రణస్థలం మండలం పైడిభీమవరం, సతివాడపాలెం గ్రామాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అన్నివర్గాల వారికి హామీలు ఇచ్చి ఇప్పుడు పొట్టకొట్టే చర్యలు చేపడుతున్నామని విమర్శించారు. ప్రధానంగా బాబువస్తే జాబు వస్తుందని అధికారంలోనికి రాకముందు ఊదరగొట్టి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను పీకేస్తూ జనాన్ని వీధిన పడేస్తున్నారన్నారు. అదే విధంగా రైతులకు, డ్వాక్రా మహిళలు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేశారని విమర్శించారు. అదే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆ విషయం కూడా మర్చిపోయారని పేర్కొన్నారు. ఇలా అన్ని రకాలుగా మోసపూరిత పాలనే సాగిస్తున్నారని వివరించారు. వంశధార నిర్వాసితుల సమస్యలు న్యాయపరమైవేనంటూ జగన్ వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలను ప్రస్తావించి పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానంటూ భరోసా ఇచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకతీతంగా అందరికీ పథకాలు వర్తింపజేయబట్టి ఇప్పటికీ ప్రజల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు. జగన్ వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, తదితరులు ఉన్నారు.