తెలంగాణ

మేడారం జాతర మూడు రోజులూ ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పాటు జరిగే సమ్మక్క, సారలమ్మల జాతరను పురస్కరించుకుని ఆ రోజులను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. 1996లో ఈ జాతరను తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తించిందని తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జాతరను దృష్టిలో ఉంచుకుని ఆ మూడు రోజులు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలని ఆయన కోరారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది మంది తరలి వస్తారని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఒక్క కుటుంబం ఈ జాతరకు హాజరవుతారని, ఇందుకు ఆ మూడు రోజులు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటిస్తే వారికి వెసులు బాటు కల్పించినట్లు అవుతుందని తెలిపారు. ఈ లేఖ కాపీని ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి కూడా అందజేసినట్లు రమణ వెల్లడించారు.