రాష్ట్రీయం

రసవత్తరం ‘మోహినీ భస్మాసుర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీవీ నాటక రంగ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవంలో భాగంగా మంగళవారం ప్రదర్శించిన రెండు పద్య నాటకాలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఆంధ్ర సంగీత సాహిత్య నృత్య నాటక అకాడమీ ప్రదర్శించిన మోహినీ భస్మాసుర పద్య నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఎం పంచానందం రచించిన ఈ నాటకానికి డాక్టర్ మల్లెల రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. కళాకారులకు దంటు కళాక్షేత్రం ప్రతినిధి వైఎస్‌ఎన్ మూర్తి ప్రభుత్వం మంజూరుచేసిన పారితోషికాన్ని అందజేసి అభినందించారు. మధ్యాహ్నం విశాఖపట్నంకు చెందిన శ్రీ మీరా కళాజ్యోత్స్న సాంస్కృతిక నాటక సంక్షేమ సంఘం కళాకారులు ప్రదర్శించిన ‘అరుణ కిరణాలు’ పద్య నాటకం కడురమ్యంగా సాగింది. ఈ నాటకానికి డాక్టర్ మీగడ రామలింగస్వామి రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. అరుణ కిరణాలు నాటక కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన పారితోషికాన్ని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రతినిధి కర్రి రంగారావు అందజేసి అభినందించారు.
నంది నాటకోత్సవంలో భాగంగా బుధవారం దంటు కళాక్షేత్రంలో నాలుగు సాంఘిక నాటకాలు ప్రదర్శిస్తారు. ఉదయం 10.30 గంటలకు ఓ తండ్రి నీకో నమస్కారం, మధ్యాహ్నం 2 గంటలకు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, సాయంత్రం 4 గంటలకు విప్లవజ్యోతి అల్లూరి, రాత్రి 7 గంటలకు ఉత్కంఠ అనే సాంఘిక నాటకాలను ప్రదర్శించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.