రాష్ట్రీయం

ఆంధ్రలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. సాంకేతికత జోడించి ఆధునిక బోధనా పద్ధతులతో నూతన విద్యా విధానం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సిఎం చంద్రబాబు తనను కలిసిన డెల్ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రమాణాలు పెంచే అంశంపై డెల్ ప్రతినిధులు సిఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వచ్చే నాలుగైదేళ్లలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు, దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని డెల్ ప్రతినిధులు వివరించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో విద్యారంగం మెరుగ్గాఉందని, అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పరిచయం చేసి ఏపీని చదువుల కేంద్రంగా మార్చేందుకు దోహదపడతామని డెల్ ప్రతినిధులు వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో డ్రాపవుట్లను తగ్గించాల్సి ఉందని, కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లను పెంచాల్సి ఉందన్నారు. ఇప్పటికే తాము బ్రెజిల్, పాకిస్తాన్ వంటి దేశాల్లో పాఠశాల స్థాయిలో విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు సిఎంకు వివరించారు. హర్యానాలో రెండేళ్లుగా పనిచేస్తూ మంచి ఫలితాలను రాబట్టినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 61వేల పాఠశాలల్లో చదువులో బాగా వెనుకబడిన వారిని అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినపుడే నిజమైన ఫలితాలు సాధించగలుగుతామని సిఎం అన్నారు. ఉత్తమమైన ఆలోచనలను సమర్ధవంతంగా అమలుచేయాల్సి ఉంటుందని చెప్పారు. పాఠ్యాంశాలు, వసతులు, నిధులకు లోటులేదని, కావల్సిందల్లా వ్యవస్థను సమర్ధంగా నడిపించే చోదకశక్తి మాత్రమేనని సిఎం అన్నారు. ప్రతి టీచర్, ప్రతి విద్యార్ధి గురించి తెలుసుకునేలా సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టాలని డెల్ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో 72 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వీరందరికీ ఉపకరించేలా వచ్చే విద్యా సంవత్సరం నుండి నూతన విధానాన్ని అమలుచేసే బాధ్యతను స్వీకరించాలని డెల్ ప్రతినిధి బృందానికి సిఎం సూచించారు. తగిన ప్రణాళికలతో వస్తే పూర్తిస్థాయిలో బాధ్యతలను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సిఎం ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు డెల్ ప్రతినిధులు ఆసక్తి చూపించారు. జూన్‌నాటికి అన్నీ సంసిద్ధం చేస్తామని సిఎంకు వివరించారు. సమావేశంలో డెల్, మెకన్సీ సంస్థల ప్రతినిధుతలో పాటు రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంథ్యారాణి, సిఎం సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు.